AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs CSK, IPL 2024: శుభ్ మన్ గిల్, సుదర్శన్ సెంచరీల మోత.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

Gujarat Titans vs Chennai Super Kings: : చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు జూలు విదిల్చారు. సెంచరీల మోత మోగించి చెన్నై జట్టుకు భారీ లక్ష్యాన్ని ముందుంచారు. ఈ మ్యాచ్ లోచెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి..

GT vs CSK, IPL 2024: శుభ్ మన్ గిల్, సుదర్శన్ సెంచరీల మోత.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
GT vs CSK, IPL 2024
Basha Shek
|

Updated on: May 10, 2024 | 10:01 PM

Share

Gujarat Titans vs Chennai Super Kings: : చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు జూలు విదిల్చారు. సెంచరీల మోత మోగించి చెన్నై జట్టుకు భారీ లక్ష్యాన్ని ముందుంచారు. ఈ మ్యాచ్ లోచెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్‌ (55 బంతుల్ 104, 9 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్‌ ( 51 బంతుల్లో 103, 5ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీలతో చెన్నైపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 210 పరుగులు జోడించారు. తద్వారా లక్నోకు చెందిన కేఎల్‌ రాహుల్‌, డికాక్‌ జోడీ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. . డేవిడ్ మిల్లర్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షారుఖ్ ఖాన్ 2 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీశాడు.

సాయి సుదర్శన్ 51 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 201.96 స్ట్రైక్ రేట్‌తో 103 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇదిగో…

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, BR శరత్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

అజింక్యా రహానే, షేక్ రషీద్, అరవెల్లి అవనీష్, సమీర్ రిజ్వీ, ముఖేష్ చౌదరి

కాగా, శుభ్‌మన్ గిల్ 55 బంతుల్లో 6 సిక్సర్లు, 9 ఫోర్లతో 189.09 స్ట్రైక్ రేట్‌తో 104 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..