- Telugu News Photo Gallery Cricket photos GT vs CSK, IPL 2024:CSK Fan Spotted Crying When Shubman Gill Hit A Six
GT vs CSK, IPL 2024: చెన్నై బౌలర్లపై గుజరాత్ బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న సీఎస్కే చిన్నారి అభిమాని
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సెంచరీలతో రెచ్చిపోయారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది.
Updated on: May 10, 2024 | 11:40 PM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సెంచరీలతో రెచ్చిపోయారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది.

ఓపెనర్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలలు చేయడమే కాకుండా తొలి వికెట్‌కు 210 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరూ తమ మెరుపు బ్యాటింగ్‌తో చెన్నై బౌలర్లను చిత్తు చేశారు.

శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ లు బ్యాటింగ్ ధాటికి చెన్నై బౌలర్లు చేతులెత్తేశారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన సీఎస్కే అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఈ క్రమంలో తన తండ్రితో కలిసి మ్యాచ్ చూడటానికి వచ్చిన CSK చిన్నారి అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన బాధను తన తండ్రికి తెలియజేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతోంది.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఇన్నింగ్స్‌లో 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేయగా, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. వీరిద్దరు 210 పరుగుల భాగస్వామ్యం గుజరాత్ తరఫున అత్యధిక స్కోరుగా రికార్డు సృష్టించింది.