Arjun Kapoor: తండ్రి కన్నుమూసిన 10 రోజులకే పనిలో.. పదేళ్ల పిల్లాడిని చదివించేందుకు ముందుకొచ్చిన హీరో
ఇంటి పెద్ద దిక్కు పోతే ఆ ఫ్యామిలీ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన సంపాదనతో ఒక కుటుంబాన్ని నడిపించే పెద్ద మనిషి లేకుంటే అందరూ రోడ్డున పడతారు. ఫలితంగా ఇంట్లో ఎవరో ఒకరు కుటుంబ బాధ్యతలను భుజాన ఎత్తుకోవాల్సి వస్త్ఉంది. వయసుకు మించిన పనులు చేయాల్సి వస్తుంది. ఢిల్లీలోని జస్ ప్రీత్ అనే పిల్లాడిది కూడా ఇదే పరిస్థితి. ఇటీవలే ఆ కుర్రాడి తండ్రి కన్నుమూశాడు.
ఇంటి పెద్ద దిక్కు పోతే ఆ ఫ్యామిలీ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన సంపాదనతో ఒక కుటుంబాన్ని నడిపించే పెద్ద మనిషి లేకుంటే అందరూ రోడ్డున పడతారు. ఫలితంగా ఇంట్లో ఎవరో ఒకరు కుటుంబ బాధ్యతలను భుజాన ఎత్తుకోవాల్సి వస్త్ఉంది. వయసుకు మించిన పనులు చేయాల్సి వస్తుంది. ఢిల్లీలోని జస్ ప్రీత్ అనే పిల్లాడిది కూడా ఇదే పరిస్థితి. ఇటీవలే ఆ కుర్రాడి తండ్రి కన్నుమూశాడు. పిల్లలను చూసుకోలేనంటూ అతని తల్లి వారిని విడిచి వెళ్లిపోయింది. అయినా ఆ బాలుడు కుంగిపోలేదు. తన తండ్రి నడిపిన స్ట్రీట్ ఫుడ్ సెంటర్ లోనే పనికి దిగాడు. కుటుంబ పోషణ కోసం తండ్రి లాగే చపాతీలు చేస్తూ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాడు. అయితే ఈ పిల్లాడి దీన పరిస్థితి గురించి ఓ ఫుడ్ వ్లాగర్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియ జేశాడు. దీంతో చాలా మంది జస్ ప్రీత్ దీన పరిస్థితిని చూసి చలించిపోయారు. ఇదే క్రమంలో చాలా మంది ఆ పిల్లాడికి తమ వంతు సాయం చేసేందుకు ముందు కొచ్చారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్, బీజేపీ లీడర్ రాజీవ్ బాబ్బర్ జస్ ప్రీత్ కు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడీ జాబితాలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ చేరాడు. పదేళ్లకు కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్న జస్ ప్రీత్ కు సాయం చేసేందుకు రెడీ అయ్యాడు.
‘ఈ చిన్నారి వీడియో నన్ను ఎంతగానో కలిచి వేసింది. అతనికి సహాయం చేయాలని ఉంది. దయచేసి బాలుడి వివరాలు తెలిసినవారు నాకు తెలియ జేయండి. జస్‌ప్రీత్ చిరునవ్వుతో తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈ చిన్నారి ధైర్యానికి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. తనను గాని, తన సోదరిని గానీ చదివించాలనుకుంటున్నాను’ అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరాడు అర్జున్ కపూర్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జస్ ప్రీత్ ను చదివేందుకు ముందుకొచ్చిన అర్జున్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
చపాతీలు చేస్తోన్న జస్ ప్రీత్ సింగ్.. వీడియో
Courage, thy name is Jaspreet.
But his education shouldn’t suffer.
I believe, he’s in Tilak Nagar, Delhi. If anyone has access to his contact number please do share it.
The Mahindra foundation team will explore how we can support his education.
— anand mahindra (@anandmahindra) May 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.