James Anderson: ఒక శకం ముగిసింది.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన 700 వికెట్ల దిగ్గజ బౌలర్

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఇంగ్లండ్‌ వెటరన్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐసీసీ, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ సోషల్ మీడియా ద్వారా అండర్సన్ రిటైర్మెంట్ సమాచారాన్ని అందించాయి. ఈ పోస్ట్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలిపాడీ లెజెండరీ ప్లేయర్

James Anderson: ఒక శకం ముగిసింది.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన 700 వికెట్ల దిగ్గజ బౌలర్
James Anderson
Follow us
Basha Shek

|

Updated on: May 11, 2024 | 7:21 PM

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఇంగ్లండ్‌ వెటరన్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐసీసీ, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ సోషల్ మీడియా ద్వారా అండర్సన్ రిటైర్మెంట్ సమాచారాన్ని అందించాయి. ఈ పోస్ట్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలిపాడీ లెజెండరీ ప్లేయర్. అలాగే తన ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే సమాచారం కూడా ఇచ్చారు. జేమ్స్ అండర్సన్‌ రిటైర్మెంట్ తో క్రికెట్‌ లో ఒక శకం ముగిసిందంటున్నారు క్రికెట్ అభిమానులు. జేమ్స్ అండర్సన్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను జూలైలో వెస్టిండీస్‌తో చారిత్రక లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ జూలై 10 నుంచి 14 వరకు జరగనుంది. జేమ్స్ ఆండర్సన్ 2003లో లార్డ్స్‌లో అరంగేట్రం చేశాడు. ఆండర్సన్ 187 టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టాడు. ధర్మశాలలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ను అవుట్ చేయడం ద్వారా అండర్సన్ భారత పర్యటనలో తన 700వ వికెట్‌ను సాధించాడీ ఇంగ్లండ్ స్టార్ పేసర్.

అందరికీ ధన్యవాదాలు..

జేమ్స్ ఆండర్సన్ తన రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. తన కుటుంబం మద్దతు లేకుండా ప్రయాణం సాధ్యం కాదని జేమ్స్ అంగీకరించాడు. అలాగే ఇక్కడి ప్రయాణంలో సహచరులు, మెంటర్లు, క్రికెట్ అభిమానులు అందించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. క్రికెట్ లో కొత్త ఛాలెంజ్ కోసం ఎదురు చూస్తున్నానని అండర్సన్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

జేమ్స్ అండర్సన్ ఎమోషనల్ పోస్ట్..

View this post on Instagram

A post shared by James Anderson (@jimmya9)

అండర్సన్ రికార్డులివే..

అండర్సన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 194 ODIలు, 19 T20Iలు, 187 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ తర్వాత టెస్టు క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన మూడో బౌలర్ అండర్సన్. ఆఖరి మ్యాచ్ లో 9 వికెట్లు తీస్తే షేన్ వార్న్ 708 వికెట్ల రికార్డును కూడా జేమ్స్ అండర్సన్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..