IPL 2024: మహి క్రేజ్ అలాంటిది మరి.. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి ధోని కాళ్లపై పడిన అభిమాని.. వీడియో చూశారా?
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగి ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయినా.. యధావిధిగా ధోనీ తన మెరుపు బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 11 బంతులు ఎదుర్కొన్న ధోని 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 1 బౌండరీ, 3 అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి.

మన భారతదేశం క్రికెట్ ను ఒక మతంగా భావిస్తారు. ఇక్కడ క్రికెట్‌కు లభించినంత గుర్తింపు మరే ఆటకు లేదు. అలాగే భారత క్రికెటర్లకు లెక్కలేనన్ని అభిమానులున్నారు. అందుకే టీమిండియా క్రికెటర్లు ఎప్పుడు మైదానంలోకి అడుగుపెట్టినా, ఆటను వీక్షించేందుకు లక్షలాది మంది అభిమానులు స్టేడియానికి వస్తుంటారు. అదే సమయంలో కొందరు అభిమానులు భద్రతా నిబంధనలను ఉల్లంఘించి తమ అభిమాన క్రికెటర్‌ను కౌగిలించుకోవడానికి మైదానంలోకి పరుగులు తీస్తుంటారు. తద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. శుక్రవారం (మే11) చెన్నై-గుజరాత్ మ్యాచ్ లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కెప్టెన్ కూల్ ఫేమ్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేస్తుండగా ఓ అభిమాని మైదానంలోకి దిగి ధోని కాళ్లపై పడిపోయాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగి ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయినా.. యధావిధిగా ధోనీ తన మెరుపు బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 11 బంతులు ఎదుర్కొన్న ధోని 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 1 బౌండరీ, 3 అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. వరల్డ్ గ్రేటెస్ట్ స్పిన్నర్లలో ఒకరైన రషీద్ ఖాన్ ఓవర్లో మహి వరుసగా 2 సిక్సర్లు బాదాడు. ధోని ధనాధన్ బ్యాటింగ్ ను చూసి అభిమానులు పిచ్చెక్కిపోయారు. కాగా, మ్యాచ్ చివరి ఓవర్లో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి నేరుగా మైదానంలోకి అడుగు పెట్టాడు.
భద్రతా సిబ్బంది కళ్లు గప్పి..
తన కోసం గ్రౌండ్‌లోకి వచ్చిన అభిమానిని చూసి ధోని కూడా అతనిని ఆట పట్టించాడు. దొరక్కుంగా గ్రౌండ్ లోనే పరుగులు తీశాడు. చివరకు ఆ అభిమాని వచ్చి నేరుగా మహీ కాళ్లపై పడ్డాడు. అనంతరం ధోనీని గట్టిగా హత్తుకున్నాడు. దీనిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే గ్రౌండ్ లోకి వచ్చి అభిమానిని పట్టుకుని బయటికి తీసుకెళ్లారు. నిజానికి ఓ అభిమాని సెక్యూరిటీ చైన్ పగలగొట్టి తన అభిమాన ఆటగాడిని మైదానంలో కలిసిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. ఒక్కోసారి అభిమానుల ఈ తరహా ప్రవర్తనపై ఆటగాళ్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరికొందరు మర్యాదగా ప్రవర్తించి మైదానం నుంచి పంపిస్తారు. నిన్నటి మ్యాచ్‌లోనూ అదే జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం బెంగళూరులో జరిగిన ఇదే ఐపీఎల్ మ్యాచ్‌లో ఓ అభిమాని కోహ్లీని కలిశాడు. కోహ్లి కూడా అతన్ని మర్యాదపూర్వకంగా బయటకు పంపాడు.
వీడియో ఇదిగో…
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








