Team India: టీమిండియా కోచ్ పదవికి పోటీ పడుతోన్న ఐదుగురు క్రికెట్ దిగ్గజాలు.. లిస్టులో ఎవరూ ఊహించని పేరు

హుల్ ద్రవిడ్ సారథ్యంలో గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. అంతకు ముందు టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఓడిపోయింది. త్వరలో జరిగే టీ 20 ప్రపంచకప్ తో ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియనుంది.

Team India: టీమిండియా కోచ్ పదవికి పోటీ పడుతోన్న ఐదుగురు క్రికెట్ దిగ్గజాలు.. లిస్టులో ఎవరూ ఊహించని పేరు
Rahul Dravid
Follow us
Basha Shek

|

Updated on: May 11, 2024 | 5:34 PM

టీమ్ ఇండియాకు త్వరలో కొత్త ప్రధాన కోచ్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఐదుగురు క్రికెట్ దిగ్గజాలు పోటీ పడుతున్నారు. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. అంతకు ముందు టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో ఓడిపోయింది. త్వరలో జరిగే టీ 20 ప్రపంచకప్ తో ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియనుంది. టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరు? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అదే సమయంలో కొత్త కోచ్ పదవికి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత టీమ్ ఇండియాకు కొత్త కోచ్ వచ్చే అవకాశం ఉంది.

హెడ్ కోచ్ రేసులో ఉన్నక్రికెట్ దిగ్గజాలు వీరే..

  • టీమిండియా సొగసరి బ్యాటర్, ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్ రేసులో ముందున్నారు. గతంలో రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీతో బీసీసీఐ అతడికి ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించింది.
  • ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ కూడా టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలుస్తోంది.
  • ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ టామ్ మూడీ కూడా హెడ్ కోచ్ రేసులో ఉన్నారు. మూడీ గతంలో శ్రీలంక జట్టుకు కోచ్ గా వ్యవహరించారు.
  • ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన అజయ్ జడేజా కూడా టీమిండియా కోచ్ పదవికి పోటీ పడుతున్నాడు. అయితే జడేజా ఎంపికపై పెద్దగా అంచనాలు లేవు. కానీ అజయ్ జడేజా సారథ్యంలోని వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
  • గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కూడా టీమిండియా కోచ్ పదవికి పోటీ పడుతున్నాడు. అతని మార్గదర్శకత్వంలో గుజరాత్ టైటాన్స్ జట్టు అరంగేట్రంలోనే ఛాంపియన్‌గా నిలిచింది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా ఈసారి కూడా గుజరాత్ బాగానే ఆడుతోంది.
ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..