AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs MI, IPL 2024: ఈడెన్ గార్డెన్ లో భారీ వర్షం.. కోల్ కతా వర్సెస్ ముంబై మ్యాచ్ ఆలస్యం..

Kolkata Knight Riders vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: IPL 2024 సీజన్ 2024 లో భాగంగా 60వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది

KKR vs MI, IPL 2024: ఈడెన్ గార్డెన్ లో భారీ వర్షం.. కోల్ కతా వర్సెస్ ముంబై మ్యాచ్ ఆలస్యం..
KKR vs MI, IPL 2024
Basha Shek
|

Updated on: May 11, 2024 | 8:14 PM

Share

Kolkata Knight Riders vs Mumbai Indians : IPL 2024 సీజన్ 2024 లో భాగంగా 60వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 170 పరుగుల టార్గెట్ ను విధించింది. కానీ ముంబై జట్టు ఈ పరుగులు కూడా చేయలేకపోయింది. 145 పరుగుల వద్దే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. కోల్‌కతా 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింఇ. ఇప్పుడు టోర్నీలో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. అయితే టోర్నీలో పరువు దక్కించుకోవడానికైనా ఆ జట్టు ఇప్పుడు విజయం సాధించడం తప్పనసరి. పైగా ఆజట్టుపై ఇప్పుడు ఎలాంటి అంచనాలు, ఒత్తిడి లేవు. కాబట్టి తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. కోల్‌కతా, ముంబై జట్లు 33 సార్లు తలపడ్డాయి. ముంబై 23 సార్లు గెలుపొందగా, కోల్‌కతా 10 సార్లు గెలిచింది. ఈడెన్ గార్డెన్‌లో 10 మ్యాచ్‌లు జరిగాయి, ఇందులో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌లు గెలవగా, కోల్‌కతా 3 మ్యాచ్‌లు గెలిచింది. కోల్‌కతా ఈ మైదానంలో మొత్తం 87 మ్యాచ్‌లు ఆడింది. 51 మ్యాచ్‌లు గెలిచి 36 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ టై అయింది.

కాగా ఈడెన్ గార్డెన్ లో భారీ వర్షం కురుస్తోంది.  వర్షం కారణంగా  టాస్ ఆలస్యం కానుంది.  సిబ్బంది మైదానాన్ని అంతటిని తెల్లటి కవర్లతో కప్పి ఉంచారు. వర్షం ఆగినా.. కవర్లపై నీరు నిలవడంతో స్టేడియాన్ని సిద్ధం చేసేందుకు ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తోంది.  మరికాసేపట్లో మ్యాచ్ కు సంబంధించి పూర్తి అప్ డేట్ ఇవ్వనున్నారు అంపైర్లు

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వాద్రా, అన్షుల్ కాంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా

ఇంపాక్ట్ ప్లేయర్స్: పీయూష్ చావ్లా

కోల్‌కతా ప్రాబబుల్ ప్లేయింగ్ XI

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

ఇంపాక్ట్ ప్లేయర్స్: వైభవ్ అరోరా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం