IPL 2024: రిషభ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు.. ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిన సమయంలో ఢిల్లీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ పై ఒక్క మ్యాచ్ నిషేధంపడింది. దీంతో ఆదివారం ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్ లో పంత్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగనుంది. ఈ తరుణంలో ఢిల్లీకి కొత్త కెప్టెన్ ను నియమించింది ఫ్రాంఛైజీ.

IPL 2024: రిషభ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు.. ఢిల్లీ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?
Delhi Capitals
Follow us

|

Updated on: May 11, 2024 | 9:44 PM

ఐపీఎల్ 17వ సీజన్‌లో 59 మ్యాచ్‌లు పూర్తయినా ఏ జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేదు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌లు టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో మిగిలిన 8 జట్లు ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం హోరాహోరీ గా తలపడుతున్నాయి. కొన్ని జట్లు జస్ట్ మ్యాచుల్లో గెలవడం ద్వారా ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు, RCB, లక్నో, చెన్నై, గుజరాత్, ఢిల్లీ జట్లకు కూడా ఫ్లే ఆఫ్ అవకాశాలున్నాయి. రన్ రేట్ కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషించనుంది. ఇలా ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిన సమయంలో ఢిల్లీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ పై ఒక్క మ్యాచ్ నిషేధంపడింది. దీంతో ఆదివారం ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్ లో పంత్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగనుంది. ఈ తరుణంలో ఢిల్లీకి కొత్త కెప్టెన్ ను నియమించింది ఫ్రాంఛైజీ. ఐపీఎల్ 17వ సీజన్ భాగంగా ఆదివారం ( మే 12)న ఉత్కంఠభరితమైన డబుల్ హెడర్‌ మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనుండగా, రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. కాగా ఆదివారం మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్‌ని మార్చనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ లేకపోవడంతో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీకి నాయకత్వం వహించనున్నాడు.

రిషబ్ పంత్ మూడోసారి ఓవర్ రేట్ కొనసాగించడంలో విఫలమయ్యాడు. రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రిషబ్ పంత్ నిర్ణీత సమయంలో ఓవర్ రేట్‌ను కొనసాగించలేకపోయాడు. పంత్ ఓవర్ రేట్‌ను కొనసాగించకపోవడం ఇది మూడోసారి. దీంతో బీసీసీఐ పంత్‌పై రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించింది. కాబట్టి పంత్ తదుపరి మ్యాచ్ ఆడలేడు. అందువల్ల పంత్ గైర్హాజరీలో అక్షర్ పటేల్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారని పిటిఐ నివేదించింది.

ఇవి కూడా చదవండి

ఆదివారం ఢిల్లీ, RCB జట్ల మధ్య ​​డూ-ఆర్ డై మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్‌ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఇరు జట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందే. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితంతో ఐపీఎల్ లో ఒక జట్టు ప్రయాణం ముగియడం ఖాయం.

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్

అక్షర్ పటేల్, రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యశ్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, జే రిచర్డ్‌సన్, రసిక్ దార్ సలామ్, ఎన్రీక్ ఓస్ట్వాల్, నార్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ