Aa Okkati Adakku OTT: అప్పుడే ఓటీటీలోకి అల్లరోడి లేటెస్ట్ మూవీ.. ‘ఆ ఒక్కటి అడక్కు’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నాంది, ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం.. ఇలా సీరియస్ రోల్స్ తో అభిమానులను అలరించిన అల్లరి నరేష్ మళ్లీ తన కామెడీ మోడ్ లోకి వచ్చాడు. అల్లరోడి లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు. జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మ‌ల్లి అంకం డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Aa Okkati Adakku OTT: అప్పుడే ఓటీటీలోకి అల్లరోడి లేటెస్ట్ మూవీ.. 'ఆ ఒక్కటి అడక్కు' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Aa Okkati Adakku Movie
Follow us

|

Updated on: May 12, 2024 | 8:23 PM

నాంది, ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం.. ఇలా సీరియస్ రోల్స్ తో అభిమానులను అలరించిన అల్లరి నరేష్ మళ్లీ తన కామెడీ మోడ్ లోకి వచ్చాడు. అల్లరోడి లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు. జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మ‌ల్లి అంకం డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మే 3న విడుదలైన ఆ ఒక్కటి అడక్కు సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మ్యాట్రిమోనీల బారిన ప‌డి యువ‌త ఎలా మోస‌పోతున్నార‌నే సమస్యకు కామెడీని జోడించి ఈ సినిమాను తెర‌కెక్కించారు.కథ, కథనం ఆసక్తిగా ఉండడంతో పాటు నరేష్ మార్క్ కామెడీ సీన్స్ ఆడియెన్స్ ను బాగానే నవ్వించాయి. అయితే ఎలక్షన్ల సీజన్ కావడంతో సినిమా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే ఆ ఒక్కడి అడక్కు మూవీ నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది.

అల్లరి నరేష్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీ కూడా సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 31 నుంచి ఆ ఒక్కటి అడక్కు మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అయితే ఆ ఒక్కటి అడక్కు మూవీ రెండు ఓటీటీల్లో ఒకేసారి రిలీజవుతుందా? లేదా కొన్ని రోజుల గ్యాప్ తో స్ట్రీమింగ్ చేస్తారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో వెన్నెల కిషోర్, జేమీ లీవర్, హర్ష చెముడు, సిమ్రాన్ చౌదరి, అరియానా గ్లోరీ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. చిలకా ప్రొడక్షన్ బ్యానర్ పై రాజీవ్ చిలకా ఈ సినిమాను నిర్మించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, సూర్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్