AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zara Hatke Zara BachKe OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

విక్కీ కౌశల్, సారా అలీఖాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’. లక్ష్మణ్ ఉటేకర్ తెరెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గతేడాది జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Zara Hatke Zara BachKe OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
Zara Hatke Zara Bachke Movie
Basha Shek
|

Updated on: May 12, 2024 | 6:43 PM

Share

విక్కీ కౌశల్, సారా అలీఖాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’. లక్ష్మణ్ ఉటేకర్ తెరెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గతేడాది జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం రూ. 40 కోట్లతో నిర్మించిన జర హట్కే జర బచ్కే ఓవరాల్ గా రూ. 115 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఆద్యంతం ఆసక్తికరంగా, కడుపుబ్బా నవ్వించే ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా తేరే వాస్తే సాంగ్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై 11 నెలలవుతున్నా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. దీంతో ఈ సినిమాను చూద్దామన్న ఆడియెన్స్ తీవ్ర నిరాశలకు లోనయ్యారు. అయితే ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా జర హట్కే జర బచ్కే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 17 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది జియో ఓటీటీ. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది.

ఇవి కూడా చదవండి

జర హట్కే జర బచ్కే సినిమాలో సుష్మిత ముఖర్జీ, ఇనాముల్‍ హక్, రాకేశ్ బేడీ, నీరజ్ సూద్, షారిబ్ హష్మి, ఆకాశ్ ఖురానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై దినేశ్ విజన్, జ్యోతీ దేశ్‍పాండే సంయుక్తంగా ఈ సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. సచిన్ – జిగార్ పాటలకు స్వరాలు సమకూర్చగా.. సందీప్ శిరోద్కర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. మరి థియేటర్లలో ఈ సూపర్ హిట్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా జియో సినిమా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

మే 17 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!