AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sprouts Curry: మసాలాలు లేకుండా హై-ప్రోటీన్ మొలకల కుర్మా.. ఎంత తింటే అంత ఆరోగ్యం

కుర్మా అనగానే మనందరి మదిలో దట్టించిన మసాలాలు, అధిక నూనెలు ఉంటాయని అనిపిస్తుంది. కానీ పరిమితమైన మసాలాలు, అతి తక్కువ నూనెతో పొట్టకు ఎంతో తేలికగా ఉండేలా 'హై-ప్రోటీన్ మిక్స్‌డ్ మొలకల కుర్మా' వండుకుంటే తిరుగులేని రుచితో పాటు శరీరానికి అపారమైన ఆరోగ్యం లభిస్తుంది. షుగర్, బీపీ ఉన్నవారే కాకుండా.. బరువు తగ్గాలనుకునే వారికి, పిల్లలకు పౌష్టికాహారం అందించాలనుకునే తల్లులకు ఈ మొలకల కూర ఒక దివ్యమైన ఎంపిక.

Phani CH
|

Updated on: Oct 27, 2026 | 9:42 PM

Share
కావలసిన పదార్థాలు: 1¼ కప్పుల మిక్స్‌డ్ మొలకలు, అర కప్పు ఉల్లిపాయ తరుగు, 2 మీడియం సైజు టమాటాలు, పావు చెంచా జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు, 
1 టీస్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేథీ, పావు చెంచా గరం మసాలా, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, పావు కప్పు వేడి నీళ్లు,  సుగంధ గ్రీన్ కొబ్బరి పేస్ట్ కోసం:  పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర చెంచా నల్ల మిరియాలు, 1 అంగుళం ముక్క తాజా అల్లం, 2 నుండి 3 పచ్చిమిరపకాయలు, అర టీస్పూన్ జీలకర్ర, 15 నుండి 20 తాజా పుదీనా ఆకులు, చిన్న గుప్పెడు తాజా కొత్తిమీర

కావలసిన పదార్థాలు: 1¼ కప్పుల మిక్స్‌డ్ మొలకలు, అర కప్పు ఉల్లిపాయ తరుగు, 2 మీడియం సైజు టమాటాలు, పావు చెంచా జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు,  1 టీస్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేథీ, పావు చెంచా గరం మసాలా, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, పావు కప్పు వేడి నీళ్లు,  సుగంధ గ్రీన్ కొబ్బరి పేస్ట్ కోసం:  పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర చెంచా నల్ల మిరియాలు, 1 అంగుళం ముక్క తాజా అల్లం, 2 నుండి 3 పచ్చిమిరపకాయలు, అర టీస్పూన్ జీలకర్ర, 15 నుండి 20 తాజా పుదీనా ఆకులు, చిన్న గుప్పెడు తాజా కొత్తిమీర

1 / 5
తయారీ విధానం: మిక్సీ జార్‌లో పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అర చెంచా మిరియాలు, చిన్న అల్లం ముక్క, 2-3 పచ్చిమిరపకాయలు, అర టీస్పూన్ జీలకర్ర, 15-20 పుదీనా ఆకులు, చిన్న గుప్పెడు కొత్తిమీర వేయాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చాలా మెత్తటి నునుపైన పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పావు చెంచా జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, అర కప్పు ఉల్లిపాయ తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడ్డాక 2 టమాటాల తరుగు వేసి.. టమాటాలపై తోలు విడిపడి గుజ్జుగా మెత్తబడేంత వరకు వేపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి.

3 / 5
టమాటాలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దను వేసి కలపాలి. కొబ్బరి ముద్ద అడుగు పట్టే అవకాశం ఉంది కాబట్టి.. పావు కప్పు నీళ్లు పోసి నిదానంగా 3 నుండి 4 నిమిషాలు పచ్చివాసన పోయేలా వేయించాలి.మసాలా వేగిన తర్వాత 1¼ కప్పుల మిక్స్‌డ్ మొలకలను వేయాలి. మీడియం మంటపై 2 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ వేయించాలి. రెండు నిమిషాల తర్వాత కప్పున్నర మరిగే వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై సరిగ్గా 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి.

4 / 5
ఆవిరి పూర్తిగా పోయాక మూత తీసి చూడాలి. మళ్లీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ఉప్పు, కారాలు సరిచూసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేథీని అరచేతులతో నలిపి వేయాలి. అలాగే తరిగిన కొత్తిమీర, చపాతీల్లోకి చక్కటి ఫ్లేవర్ కోసం పావు చెంచా గరం మసాలా వేసి ఒక్క ఉడుకు రానిచ్చి దింపేయాలి. అంతే, నోరూరించే పోషకాల గని 'మిక్స్‌డ్ మొలకల కుర్మా' సిద్ధం! వేడివేడి ఫుల్కాలు, చపాతీలు లేదా జొన్న రొట్టెల్లో ఈ జారుడు కుర్మా నంజుకుని తింటుంటే నాలుకకు అమితమైన తృప్తినిస్తూ గొంతులోకి హాయిగా జారిపోతుంది!

5 / 5
Follow Us