రాయల్ లుక్ లో రెచ్చగొడుతున్న అదితి రావు హైదరి

27-10-2026

Pic credit - Instagram

Phani Ch

అదితి రావు హైదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. చెలియా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది.

2006లో ప్రజాపతి అనే మలయాళం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టెంది అదితి రావు హైదరి.  ఆ తరువాత హిందీ తెలుగు తమిళ్ వంటి పలు భాషల్లో సినిమాలు చేసింది.

తాజాగా  సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం సినిమాతో హిట్ కొట్టగా తరువాత  అంతరిక్షం,  వి, మహాసముద్రంలాంటి సినిమాలు చేసింది కానీ మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయింది

ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీలోకి రాకమునుపే అనగా 2002లో సత్య దీప్ మిశ్రా ను వివాహం చేసుకొని, 2012లో తన భర్తకు విడాకులు ఇచ్చి సినిమాలపైనే ఫోకస్ చేసింది. 

ఆ తరువాత హీరో సిద్ధార్థ తో ప్రేమలో పడిన ఈమె, ఈ ఏడాది మార్చి 27 న వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ లోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. 

అదితి రావు హైదరి ఇప్పటివరకు 35 సినిమాలు, సిరీస్‌లలో పనిచేసింది. ఇటీవలే విడుదలైన సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'హీరామండి' వెబ్ సిరీస్ తో తెగ పాపులర్ అయ్యింది.

సీనియర్ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో, అదితీ రావు ఇతడికి జోడీగా చేసిన సినిమా 'పరివారిక్ మనురంజన్'.  50 ఏళ్ల వ్యక్తి, తనకంటే చాలా తక్కువ వయసున్న అమ్మాయితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో తీసిన కామెడీ మూవీ ఇది.