AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 28 రాశి ఫలాలు: వారికి ఉద్యోగం, ఆదాయ విషయాల్లో గుడ్‌న్యూస్

Horoscope Today (October 28, 2026): బుధవారం నాడు గ్రహగతుల ప్రభావంతో 12 రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి? కొందరికి ఉద్యోగ, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తే, మరికొందరు ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అక్టోబర్ 28 రాశి ఫలాలు: వారికి ఉద్యోగం, ఆదాయ విషయాల్లో గుడ్‌న్యూస్
Rasi Phalalu 28 Oct 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 28, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 28, 2026): మేష రాశి వారికి ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి అనుకోని మార్గంలో ఆదాయం కలిసి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆస్తి వివాదంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. సోదరులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అనుకోని మార్గంలో ఆదాయం కలిసి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. దైవకార్యాల మీద ఎక్కువగా ఖర్చవుతుంది. దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగతి చెందుతాయి. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఖర్చులు తగ్గించుకోవాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులు బాగా ఎక్కువగా ఆధారపడతారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. వృత్తి జీవితం సాఫీగా, నిలకడగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు తగ్గే సూచనలున్నాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. సకాలంలో ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణ యాలు అమలు చేసి ప్రయోజనం పొందుతారు. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. పదోన్నతికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దానికంటే రాబడి బాగా పెరుగుతుంది. ప్రస్తుతం అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఏ పని చేపట్టినా సఫలమవుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ స‍మస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ముఖ్య మైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. రావలసిన డబ్బు సకాలం చేతికి అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశముంది. కొద్దిపాటి ప్రణాళికతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఏ పని తలపెట్టినా తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. అనేక విధాలుగా లాభాలు అందే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. శరీరానికి విశ్రాంతి అవసరం అని గ్రహించండి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సోదర వర్గంతో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. మిత్రులతో ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయానికి వెడతారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఒకశుభవార్త వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగుల శ్రమకు, ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలు, అదనపు రాబడి పెరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో తప్పకుండా ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. ఉద్యోగంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించకపోవడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు సఫలవుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.

Follow Us
మౌనం విలువ నేర్పిన తాబేలు కథ.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నీతి!
మౌనం విలువ నేర్పిన తాబేలు కథ.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నీతి!
కొత్త లుక్‌తో Maruti Victoris.. పూర్తి వివరాలివే
కొత్త లుక్‌తో Maruti Victoris.. పూర్తి వివరాలివే
డీమార్ట్‌లో తక్కువ ధరకే సరుకులు కొనాలంటే ఏం రోజు వెళ్తే మంచిది?
డీమార్ట్‌లో తక్కువ ధరకే సరుకులు కొనాలంటే ఏం రోజు వెళ్తే మంచిది?
రాశి ఫలాలు: వారికి ఉద్యోగం, ఆదాయ విషయాల్లో గుడ్‌న్యూస్
రాశి ఫలాలు: వారికి ఉద్యోగం, ఆదాయ విషయాల్లో గుడ్‌న్యూస్
వొడాఫోన్‌ ఐడియా యూజర్లకు షాక్‌.. ఈ ప్లాన్‌పై రూ.40 పెంపు..!
వొడాఫోన్‌ ఐడియా యూజర్లకు షాక్‌.. ఈ ప్లాన్‌పై రూ.40 పెంపు..!
ఇంటి నిర్మాణం కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే ఎక్కువ ఖర్చు అవుతుందా?
ఇంటి నిర్మాణం కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే ఎక్కువ ఖర్చు అవుతుందా?
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..నవంబర్‌ 1 నుంచి రూ.1500లకే వార్షిక పాస్
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..నవంబర్‌ 1 నుంచి రూ.1500లకే వార్షిక పాస్
Hyderabad: ఏసీబీ వలలో మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌..!
Hyderabad: ఏసీబీ వలలో మీర్‌చౌక్‌ ఇన్స్‌పెక్టర్‌, హోంగార్డ్‌..!
ఆ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టం.. కాబోయే భర్త ఎలా ఉండాలంటే?
ఆ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టం.. కాబోయే భర్త ఎలా ఉండాలంటే?
వరుసగా ఆరు ఫ్లాపులు.. అయినా చేతిలో ఏకంగా అరడజను సినిమాలు
వరుసగా ఆరు ఫ్లాపులు.. అయినా చేతిలో ఏకంగా అరడజను సినిమాలు