AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dosha: ఆ రాశులకు మళ్లీ శని దోషం ఎఫెక్ట్..! ఆర్థిక విషయాల్లో జాగ్రత్త

Shani Dosha Effect: నవంబర్‌లో గ్రహాల సంచారంలో చోటుచేసుకునే మార్పులు కొన్ని రాశుల వారికి సవాళ్లను తీసుకురావచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శని దోషం ప్రభావం కారణంగా ఈ రాశులవారు ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకీ ఆ రాశులు ఏవి? శని ప్రభావం తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి?

Shani Dosha: ఆ రాశులకు మళ్లీ శని దోషం ఎఫెక్ట్..! ఆర్థిక విషయాల్లో జాగ్రత్త
Shani Dosha
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 4:42 PM

Share

ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శని కొన్ని రాశుల మీద మరోసారి తన ప్రతాపం చూపించే అవకాశం ఉంది. నవంబర్ లో శని వక్ర త్యాగం చేయడం, అక్టోబర్ 31 నుంచి గురు దృష్టి నుంచి బయటపడడం వంటి కారణాల వల్ల శని మళ్లీ స్వతంత్రంగా వ్యవహరించి మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ, మీన రాశులవారిని ముప్పుతిప్పలు పెట్టడం జరుగుతుంది. గురువు జనవరి 25 మళ్లీ కర్కాటక రాశిలో ప్రవేశించి శనిని వీక్షించే వరకు వీరికి శని బెడద తప్పకపోవచ్చు. శనికి తైలాభిషేకం చేయించడం, శివుడికి అభిషేకం చేయించడం, నలుపు రంగు కలిసిన దుస్తుల్ని ధరించడం వంటివి చేయడం వల్ల శని దోషం బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

మేష రాశి

ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న శనైశ్చరుడు స్వతంత్రుడు కావడం వల్ల దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం, దూర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందకపోవచ్చు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందదు. పదోన్నతి, వేత నాల పెరుగుదల వంటివి సంతృప్తినివ్వకపోవచ్చు. ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలు ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. రాజపూజ్యాల కంటే అవమానాలు బాగా ఎక్కువవుతాయి.

సింహ రాశి

ఈ రాశికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి అష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. కుటుంబంలో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో నష్టాలు కలుగు తాయి. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు పెరుగుతాయి. మానసిక, శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కన్య రాశి

ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు చివరి క్షణంలో వెనక్కు వెళ్లడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో చిన్నా చితకా సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో భాగస్వాములతో విభే దాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో అధిక శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. రాబడి తగ్గే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

ఈ రాశివారికి చతుర్థ స్థానంలో శని ప్రవేశం వల్ల అర్ధాష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల సుఖ సంతోషాలు తగ్గుతాయి. ఆస్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలకు బ్రేకులు పడతాయి. తల్లి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. మానసిక ప్రశాం తత లోపిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలకు ఆటం కాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కష్టార్జితం వృథా అవుతుంటుంది.

కుంభ రాశి

మూడవ దశ ఏలిన్నాటి శని దోషంలో ఉన్న ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు బాగా పెరుగుతాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందక ఇబ్బందిపడతారు. ధనాదాయం బాగా తగ్గిపోతుంది. డబ్బు తీసుకున్నా, ఇచ్చినా అది పరిష్కారం కావడానికి చాలా కాలం పడుతుంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గుతాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. మిత్రుల వల్ల నష్టపోతారు.

మీన రాశి

రెండవ దశ ఏలిన్నాటి శని దోషంతో కొద్దికాలంగా అనారోగ్యాలు, అపజయాలు, అపనిందలతో అవ స్థలు పడుతున్న ఈ రాశివారు సుమారు 86 రోజుల పాటు ప్రాధాన్యం, ప్రాభవం కోల్పోయే అవ కాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు పీడిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించకపోవచ్చు. ఆదా యం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తల్తెత్తుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. విజయాలు, సాఫల్యాలు తగ్గిపోతాయి.

Follow Us