కార్తీక మాసంలో వీరు జీవితంలో ఓ మెట్టు పైకి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Karthika Masam 2026: కార్తీక మాసం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు సాగే ఈ మాసంలో గ్రహాల సంచారం కారణంగా ఆరు రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ జీవితంలో అనుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవి? వీరికి ఎలాంటి శుభ ఫలితాలు కలగనున్నాయి?

నవంబర్ నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు సాగే కార్తీక మాసంలో కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా అదృష్టం పట్టబోతోంది. ఈ మాసమంతా గురువు తనకు మిత్ర క్షేత్రమైన సింహ రాశిలో కుజుడితో కలిసి ఉండడంతో పాటు, శుక్ర, బుధులు కూడా స్వక్షేత్ర, మిత్ర క్షేత్రాల్లో సంచారం చేయడం వల్ల మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారిని లక్ష్మీదేవి, కుబేరుడు అన్ని విధాలా అనుగ్రహించే అవకాశం ఉంది. వీరి జీవితాల్లో అత్యధికంగా శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉండడంతో పాటు, ఉద్యో గంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. కుటుంబ జీవితం వైభవంగా సాగిపోతుంది.
మేష రాశి
రాశ్యధిపతి కుజుడితో సహా శుభ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశికి పంచమ, సప్తమ స్థానాలు పటిష్ఠం అవుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఎలాంటిప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. అనేక ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. విదేశీ ఉద్యోగం చేయాలన్న కల, సొంత ఇల్లు కలిగి ఉండాలన్న కల నెరవేరుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.
కర్కాటక రాశి
ధన స్థానంలో గురు, కుజులు, చతుర్థ స్థానంలో బుధ, శుక్రుల సంచారం కారణంగా కార్తీక మాస మంతా వీరికి సుఖ సంతోషాలు, విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. మదుపులు, పెట్టుబడుల వల్ల అత్యధికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి నిశ్చయమవుతుంది. గృహ యోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహ రాశి
ఈ రాశిలో గురు, కుజులు కలవడం, తృతీయ స్థానంలో శుక్ర, బుధ, రవుల యుతి వల్ల కార్తీక మాసమంతా ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కొన్ని అవకాశాలు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
తుల రాశి
ఈ రాశివారికి కార్తీకఈ మాసమంతా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ఈ రాశిలో శుక్ర, బుధ, రవులు, లాభ స్థానంలో గురు, కుజుల యుతి వల్ల రాజయోగాలు, ధన యోగాలు కలుగు తాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. అత్యంత ప్రముఖులకు సన్నిహితమయ్యే అవకాశం ఉంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడవుతాడు. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు వైభవంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లడం జరుగుతుంది.
ధనుస్సు రాశి
రాశ్యధిపతి గురువు భాగ్య స్థానంలో కుజుడితో కలవడంతో పాటు పాటు, లాభ స్థానంలో శుక్ర, బుధుల యుతి వల్ల ఈ రాశివారి జీవితం అత్యంత సంపన్న జీవితంగా మారిపోయే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. మనసులోని కొన్ని కోరికలు, ఆశలు నెర వేరు తాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
కుంభ రాశి
కార్తీక మాసంలో ఈ రాశికి సప్తమ, భాగ్య స్థానాలు బాగా పటిష్ఠం అవుతున్నందువల్ల ఈ రాశి వారి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు అనేక విధాలుగా రాబడి వృద్ది చెందుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందు తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశా లకు వెళ్లడం జరుగుతుంది. ఏలిన్నాటి శని దోషం తగ్గుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.



