AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుజ దృష్టితో వీరికి గోల్డెన్ డేస్..! ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు సఫలం

Mars Aspect 2026: ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడు చతుర్థ దృష్టితో తులా రాశిలో ఉన్న బుధ, శుక్ర, రవి గ్రహాలను వీక్షించడం జరుగుతోంది. నవంబర్ 12 వరకు ఈ వీక్షణ కొన్ని రాశులకు శుభ ఫలితాలనిస్తుంది. కుజుడి దృష్టి వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారిలో ఆశలు, కోరికలు పెరుగుతాయి. తమ లక్ష్యాలను ఏదో విధంగా సాధించుకోవాలన్న పట్టుదల వృద్ధి చెందుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. ధనం, ఉద్యోగం, గృహం, కుటుంబం, సంతానం వంటి వాటి మీద దీని సానుకూల ప్రభావం ఉంటుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 5:31 PM

Share
మేషం: చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థానంలో ఉన్న రవి, బుధ, శుక్రులను వీక్షించడం వల్ల ఈ రాశివారికి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. శుభ కార్యాలకు మార్గం సుగమం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.

1 / 6
మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న కుజుడు పంచమ స్థానంలోఉన్న రవి, శుక్ర, బుధులను వీక్షించడం వల్ల సమాజంలో రాజపూజ్యాలు పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో సమర్థతకు, ప్రతిభకు ఆశించిన గౌరవం దక్కుతుంది. హోదాతో పాటు జీతభత్యాలు కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు.

2 / 6
కర్కాటకం: ఈ రాశిలో ఉన్న కుజుడు చతుర్థ స్థానంలో ఉన్న బుధ, శుక్ర, రవులను చూడడం వల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, ఆస్తి లాభం కలుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. విదేశీయానానికి మార్గం సుగమమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.

3 / 6
కన్య: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న రవి, బుధ, శుక్రుల్ని లాభ స్థానం నుంచి కుజుడు చూడడం వల్ల ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బంతా చేతికి అందుతుంది. లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు బిజీ అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు వింటారు.

4 / 6
తుల: ఈ రాశిలో సంచారం చేస్తున్న బుధ, శుక్ర, రవుల్ని దశమ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఉద్యోగపరంగానే కాక, సామాజికంగా కూడా రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో ఉన్నత పద వులు చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ప్రముఖులుగా గుర్తింపు పొందు తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సొంత ఇంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

5 / 6
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న కుజుడు దశమ స్థానంలో ఉన్న శుక్ర, బుధ, రవులను చూడడం వల్ల ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి సంబంధం నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగం పడుతుంది. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి.

6 / 6
Follow Us
కుజ దృష్టితో వీరికి గోల్డెన్ డేస్..! ప్రేమ,పెళ్లి ప్రయత్నాలు సఫలం

బాయ్ ఫ్రెండ్‌తో పారిపోవాలనుకున్న బాలిక.. ఇంటర్‌లో స్టేట్ ర్యాంక్!

ప్రధాని మోదీపై కెవిన్ పీటర్సన్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..?

ఊసరవెల్లి రంగులు మార్చడం వెనక ఇంత పెద్ద కథ ఉందా..

ప్రకృతిని కాపాడే చేతులపైనే చెత్త దాడి..!

కుర్రాళ్లు సైతం కుళ్లుకునేలా ఫిట్నెస్.. 64 ఏళ్ల వయసులో ...

భారత్‌లో కార్ల అమ్మకాలతో ఎలాన్‌ మస్క్‌కు ఎంత ఆదాయమో తెలుసా?

CBSE విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి 12వ తరగతి వరకు AI పాఠాలు

మూడో టీ20లో అభిషేక్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరో తేలిపోయిందా..!

ఆ రాశులకు మళ్లీ శని దోషం ఎఫెక్ట్..! వీరు చేయాల్సిన పరిహారాలు