అయేషా ఖాన్ తెలుగు సినీ ప్రయాణం 2022లో విడుదలైన ముఖచిత్రం సినిమాతో ప్రారంభమైంది. ఇందులో మాయా ఫెర్నాండెజ్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఓం భీమ్ బుష్ సినిమాలో అయేషా ఖాన్ రత్తాలు పాత్రలో కనిపించింది. ఈ సినిమాతో ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు లభించింది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలోని ‘మోత’ పాటలో అయేషా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో ఆమె గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాలోనూ అయేషా ఖాన్ కనిపించింది. ఈ చిత్రంలో స్మిత అనే పాత్రలో నటించింది.
తొలి సినిమాల నుంచే తన గ్లామర్‌తో అయేషా ఖాన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా పాటల్లో, ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ యువతలో గుర్తింపు తెచ్చుకుంది.
హిందీ బిగ్ బాస్ 17లో పాల్గొనడంతో అయేషా ఖాన్‌కు మరింత పాపులారిటీ వచ్చింది. ఈ షో ద్వారా ఆమెకు టెలివిజన్ ప్రేక్షకుల్లోనూ గుర్తింపు పెరిగింది.
అయేషా ఖాన్ తన ఫొటోషూట్లు, ఫ్యాషన్ లుక్స్, గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.