Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ‘ఇది తొండాట బ్రో’.. రవీంద్ర జడేజాపై ఫ్యాన్స్ ఫైర్.. అసలేం జరిగిందంటే? వీడియో

ఐపీఎల్ టోర్నీలో చూస్తే పరుగుల వర్షం కురుస్తోంది. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్ల తో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. అందుకే 200 పార్కు స్కోర్ చేసినప్పటికీ, గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అయితే ఆదివారం మాత్రం లో స్కోరింగ్ గేమ్ జరిగింది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కేవలం 142 పరుగులకే పరిమితమైంది

IPL 2024: 'ఇది తొండాట బ్రో'.. రవీంద్ర జడేజాపై ఫ్యాన్స్ ఫైర్.. అసలేం జరిగిందంటే? వీడియో
Ravindra Jadeja
Basha Shek
|

Updated on: May 12, 2024 | 8:53 PM

Share

ఐపీఎల్ టోర్నీలో చూస్తే పరుగుల వర్షం కురుస్తోంది. బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్ల తో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. అందుకే 200 పార్కు స్కోర్ చేసినప్పటికీ, గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అయితే ఆదివారం మాత్రం లో స్కోరింగ్ గేమ్ జరిగింది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కేవలం 142 పరుగులకే పరిమితమైంది. సాధారణంగా ఈ స్కోరును ఛేదించడం చెన్నైకి సులువుని అభిమానులు భావించారు. కానీ మ్యాచ్ లో అలా జరగలేదు. విజయం కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి వరకు శ్రమించాల్సి వచ్చింది.రుతురాజ్ గైక్వాడ్ చివరి వరకు పట్టుదలతో ఆడడంతో చెన్నై గెలుపు ఖాయమైంది. చివరకు 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది చెన్నై. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ టీమ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్ రేసులో స్థానం ఖాయం చేసుకుంది. మరోవైపు మ్యాచ్‌లో కీలక సమయంలో రవీంద్ర జడేజా అబ్ స్ట్రకింగ్ ద ఫీల్డ్ కింద ఔటయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 16వ ఓవర్‌ను అవేశ్ ఖాన్‌కు అప్పగించాడు. ఈ ఓవర్ ఐదో బంతికి రవీంద్ర జడేజా థర్డ్ మ్యాన్ వైపు బంతిని కొట్టాడు. అలాగే ఒక పరుగు తీసుకుని మరో పరుగు కోసం పరిగెత్తాడు. అయితే ఈసారి అతనికి, రుతురాజ్ గైక్వాడ్‌కు మధ్య సమన్వయం లోపించింది. దీంతో రవీంద్ర జడేజా మళ్లీ వెనక్కు పరిగెత్తాల్సి వచ్చింది. అయితే సంజూ శాంసన్ బంతిని తీసుకుని వికెట్ల వైపు విసిరాడు.

ఇవి కూడా చదవండి

కానీ జడేజా తన దిశను మార్చుకొని వికెట్ల వైపునకు అడ్డంగా పరిగెత్తాడు. దీంతో బంతి జడేజా వీపునకు తగిలింది. దీంతో రాజస్థాన్ ప్లేయర్లు అంపైర్లకు అపీలు చేశారు. జడేజా ఉద్దేశపూర్వకంగానే వికెట్ల వైపు మళ్లాడని థర్డ్ అంపైర్ నిర్ధారించి ఔట్‌ ఇచ్చాడు. జడేజా అసహనంగా మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ చరిత్రలో అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కారణంగా ఔటైన మూడో ప్లేయర్‌‌ జడేజా. రవీంద్ర జడేజా బంతిని చూసి కావాలనే అలా చేసినట్లు కనిపించింది. కాబట్టి అతను అవుట్ అని ప్రకటించారు. రవీంద్ర జడేజా 7 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటయ్యాడు.

గత మ్యాచ్ లోనూ..

ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా కూడా ఇలాగే వ్యవహరించాడు. అయితే నిర్ణయం థర్డ్ అంపైర్ వద్దకు వెళ్లకముందే పాట్ కమిన్స్ ఆ నిర్ణయాన్ని మార్చుకోవడంతో జడేజాకు లైఫ్ లభించింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు రవీంద్ర జడేజాపై మండిపడుతున్నారు. అతను తొండాట ఆడుతున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు
మూడో అంతస్తు కిటికీకి వేలాడిన బాలిక.. రెప్పపాటులో తప్పిన ముప్పు
గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో
గొర్రెలు మేపేందుకు అడవికి వెళ్లిన యువతి.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
పుట్టగొడుగుల కూర పెట్టి.. అత్తమామలను హత్య చేసి వీడియో
వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో
వాష్ రూమ్‌లో భారీగా శబ్దాలు..తలుపు తీయగానే గుండె గుభేల్ వీడియో
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. లైవ్ వీడియో..
ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. లైవ్ వీడియో..
పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ..
పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ..
జూలై కరెంట్ బిల్లు చూడగా.. మాస్టర్ గారికి షాక్ కొట్టినంత పనైంది..
జూలై కరెంట్ బిల్లు చూడగా.. మాస్టర్ గారికి షాక్ కొట్టినంత పనైంది..
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు..
తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు..
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో
ఇది కదా విశ్వాసం అంటే..67 మంది ప్రాణాలను కాపాడిన శునకం వీడియో