- Telugu News Photo Gallery Cinema photos Actress Sonali Bendre says Virat Kohli is her favourite cricketer in the world
Sonali Bendre: రోహిత్ లేదా కోహ్లీ? సోనాలి బింద్రేకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా?
అలనాటి హీరోయిన్ సోనాలీ బింద్రే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. ఇక క్యాన్సర్ మహహ్మారిని ధైర్యంగా అధిగమించి తనలాంటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది.
Updated on: May 12, 2024 | 10:39 PM

అలనాటి హీరోయిన్ సోనాలీ బింద్రే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. ఇక క్యాన్సర్ మహహ్మారిని ధైర్యంగా అధిగమించి తనలాంటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది.

ప్రస్తుతం కొన్ని టీవీ షోలు, డ్యాన్సింగ్ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోన్న సోనాలీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

సోనాలి బింద్రే ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్ కోసం శుభంకర్ మిశ్రాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. సోనాలికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలలో మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? అని అడిగారు. దీనికి కోహ్లీ అనే సమాధానమిచ్చింది సోనాలి.

విరాట్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఇక నాకు అనుష్క అంటే చాలా ఇష్టం . వాళ్లిద్దరి జోడీ నాకు చాలా ఇష్టం అని సోనాలి చెప్పింది.

విరాట్ కోహ్లీ, అనుష్కలకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఒక్క విరాట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 268 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండడం విశేషం.