Test Cricket: టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. లిస్టులో ఊహకందని పేరు.. ఆ ప్లేయర్ ఎవరంటే.?
టెస్ట్ క్రికెట్‌ని నిజమైన క్రికెట్ అంటారు. ఒక బ్యాట్స్‌మెన్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలంటే, అతను టెస్ట్ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని అంటుంటారు. టెస్ట్ క్రికెట్‌లో, బ్యాట్స్‌మన్ హాయిగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్ట్రైక్ రేట్ గురించి ఆలోచించకుండా పరుగులు సాధిస్తుంటారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

టెస్ట్ క్రికెట్‌ని నిజమైన క్రికెట్ అంటారు. ఒక బ్యాట్స్‌మెన్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలంటే, అతను టెస్ట్ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని అంటుంటారు. టెస్ట్ క్రికెట్‌లో, బ్యాట్స్‌మన్ హాయిగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్ట్రైక్ రేట్ గురించి ఆలోచించకుండా పరుగులు సాధిస్తుంటారు. అయితే, ఈ ఫార్మాట్‌లో కూడా కొంతమంది బ్యాట్స్‌మెన్ తుఫాన్ వేగంలో పరుగులు సాధిస్తుంటారు. వివియన్ రిచర్డ్స్, బ్రెండన్ మెకల్లమ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి బ్యాట్స్‌మెన్ ఈ కోవలోకి వస్తారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో తుఫాను బ్యాటింగ్ చేసే బ్యాట్స్‌మెన్‌లను ప్రేక్షకులు కూడా ఇష్టపడుతుంటారు. వన్డే, టీ20 ఫార్మాట్ల కారణంగా ఆటగాళ్ల ఆటలో చాలా మార్పులు వచ్చాయి. ఈ కారణంగానే చాలా మంది ఆటగాళ్లు టెస్టుల్లోనూ తక్కువ బంతుల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడి రికార్డులు సృష్టించారు. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ప్రపంచంలోని టాప్ 3 ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
మిస్బా ఉల్ హక్ (పాకిస్తాన్)
టెస్టు ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ పేరిట ఉంది. 2014 అక్టోబర్‌లో అబుదాబిలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున మిస్బా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు నమోదు చేశాడు. తన రెండో ఇన్నింగ్స్‌లో మిస్బా 57 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మిస్బా 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 356 పరుగుల తేడాతో విజయం సాధించింది.
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
ప్రస్తుత క్రికెట్‌లో టాప్ 3 అగ్రెసివ్ బ్యాట్స్‌మెన్స్ గురించి మాట్లాడితే, అందులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ పేరు ఖచ్చితంగా వస్తుంది. వార్నర్ అవసరమైనప్పుడు వేగంగా పరుగులు చేయగల బ్యాట్స్‌మెన్. అందుకే అతను మూడు ఫార్మాట్లలో విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. వార్నర్ 2017 జనవరిలో పాకిస్థాన్‌పై ఇదే విధమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (113) సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను వేగంగా 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 23 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సమయంలో వార్నర్ 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 220 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)
ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ మూడో స్థానంలో నిలిచాడు. మార్చి 2005లో జింబాబ్వేపై కల్లిస్ తన టెస్ట్ కెరీర్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కలిస్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో కల్లిస్ 54 (25) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అటు ఇండియా తరపున రిషబ్ పంత్ 28 బంతుల్లో అర్ధ సెంచరీని శ్రీలంకపై బాదేశాడు. ఈ ఫీట్ అతడు 2022లో అందుకున్నాడు. కేవలం 30 బంతులలోపు అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్లలో పంత్ ఒక్కడికే చోటు దక్కింది.