Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: చెన్నైతో కీలక మ్యాచ్.. ఆర్సీబీని కాపాడేది ’18’ ఒక్కటే.. ప్లే ఆఫ్ లెక్కలు చూశారా?

IPL 2024 68వ మ్యాచ్‌లో RCB, CSK జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మే 18న జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. అంటే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు

IPL 2024: చెన్నైతో కీలక మ్యాచ్.. ఆర్సీబీని కాపాడేది '18' ఒక్కటే.. ప్లే ఆఫ్ లెక్కలు చూశారా?
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: May 14, 2024 | 4:59 PM

IPL 2024 68వ మ్యాచ్‌లో RCB, CSK జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మే 18న జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. అంటే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు. కాగా చెన్నైతో మ్యాచ్ లో విజయం ఆర్సీబీ జట్టుదేనంటున్నారు అభిమానులు. మే 18న మ్యాచ్ జరగడమే ఇందుకు కారణం. అంటే మే 18న ఇప్పటి వరకు ఆర్సీబీ 4 మ్యాచ్‌లు ఆడింది. 2013 లో మే 18న జరిగిన మ్యాచ్ లో CSKపై RCB గెలిచింది. 2014లో ఇదే తారీఖున CSK ని కూడా చిత్తు చేసింది. ఇక 2016లో మే 18 పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది. గతేడాది ఇదే తేదీన SRHను ఓడించింది ఆర్సీబీ. ఇప్పుడు కూడా మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో RCB తలపడనుంది. కాబట్టి ఈసారి కూడా విజయం ఆర్సీబీ జట్టుదేనన్న వాదనను అభిమానులు ముందుకు తెస్తున్నారు.

ఇక మే 18న జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లీ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. మే 18న కింగ్ కోహ్లీ ఐపీఎల్‌లో 4 మ్యాచ్‌లు ఆడాడు. CSKపై 29 బంతుల్లో 56 నాటౌట్, 27 (29) పరుగులు, పంజాబ్ కింగ్స్‌పై 113 (50) పరుగులు చేశాడు. అలాగే, గత సీజన్‌లో SRH పై 63 బంతుల్లో 100 రన్స్ కొట్టాడు. కాబట్టి మే 18న కింగ్ కోహ్లి మరోసారి రెచ్చిపోవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మ్యాచ్‌లో RCB కనీసం 18 పరుగుల తేడాతో గెలిస్తే, CSK నెట్ రన్ రేట్‌ను అధిగమించవచ్చు. RCB ఛేజింగ్ చేస్తే 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా పాయింట్ల పట్టికలో CSKని అధిగమించవచ్చు. యాదృచ్ఛికంగా ఇక్కడ 18 కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయనుంది.

ఇక అన్నిటికన్నా మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 నే. కాబట్టి కింగ్ దగ్గరుండి ఆర్సీబీని గెలిపిస్తాడని అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. మొత్తానికి చెన్నైతో మ్యాచ్ లో ఆర్సీబీ విజయం, ప్లే ఆఫ్ అవకాశాలన్నీ 18 నెంబర్ తోనే ముడిపడిఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..