Godzilla x Kong The New Empire OTT: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చేంటే?

'టిల్లు స్క్వేర్' సినిమాతో పాటు మార్చి 29న థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. రూ.15 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు. రూ.52.4 కోట్ల డాలర్ల వసూళ్లు చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ గాడ్జిల్లా మూవీ ఆడుతోంది. అయితే సడెన్ గా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

Godzilla x Kong The New Empire OTT: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చేంటే?
Godzilla X Kong The New Emp
Follow us

|

Updated on: May 13, 2024 | 8:23 PM

హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్. ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో పాటు మార్చి 29న థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. రూ.15 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు. రూ.52.4 కోట్ల డాలర్ల వసూళ్లు చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ గాడ్జిల్లా మూవీ ఆడుతోంది. అయితే సడెన్ గా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ టికెట్ బుకింగ్ అండ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో సోమవారం ( మే 13) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే ఓ ట్వి స్ట్ ఇచ్చింది ఓటీటీ. ప్రస్తుతం ఈ మూవీని ఉచితంగా చూడలేం. కేవలం రెంటల్ బేసిస్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. రెంట్ విధానంలో 4k క్వాలిటీతో ఈ మూవీ చూడాలంటే రూ.549 చెల్లించాలి. పూర్తిగా కొని చూడాలంటే మాత్రం రూ.799 చెల్లించాలని ఓటీటీ సంస్థ తెలిపింది. అయితే ఇంగ్లిష్ తోపాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నూ ఈ సినిమా అందుబాటులో ఉంది. అలాగే ఈ మూవీని రెంట్ కు తీసుకున్నా, కొనుగోలు చేసినా.. మొబైల్, వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ టీవీ, యాపిల్ టీవీ, ఫైర్ టీవీల్లో చూసే అవకాశం ఉంది. దీంతో పాటు ఐమ్యాక్స్ 3డీ వెర్షన్ తోపాటు 4డీఎక్స్, 3డీ, 2డీ వెర్షన్లలోనూ ఈ గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్ మూవీ చూడొచ్చు.

కాగా ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షణ్ థ్రిల్లర్ మూవీ ఇప్పటికే బుక్ మై షో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోండగా.. మంగళవారం ( మే 14) నుంచి అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్‌లోనూ రిలీజ్ కానుంది. అయితే అది కూడా కేవలం రెంటల్ బేసిస్ లో మాత్రమేనని తెలుస్తోంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. ఇందులో గాడ్జిల్లా, కాంగ్ కలిసి భూమి ఎదుర్కొంటున్న సరికొత్త ముప్పు నుంచి ఎలా రక్షించాయన్నది చూపించారు. గాడ్జిల్లా, కింగ్ కాంగ్ ల పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మరి థియేటర్లలో గాడ్జిల్లా కాంగ్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

బుక్ మై షో లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.