Team India: ఈ పిల్లాడు టీమిండియా ఫ్యూచర్ స్టార్.. IPL 2024లోనూ అదరగొడుతున్నాడు .. ఎవరో గుర్తు పట్టారా?

ఆదివారం (మే 12) మాతృదినోత్సవం సందర్భంగా అందరూ తమ తల్లులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇందులో సినీ ప్రముఖులు, స్టార్ క్రికెటర్లు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసుకుని విషెస్ చెప్పారు. మరికొందరు తల్లులతో తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు.

Team India: ఈ పిల్లాడు టీమిండియా ఫ్యూచర్ స్టార్.. IPL 2024లోనూ అదరగొడుతున్నాడు .. ఎవరో గుర్తు పట్టారా?
Team India Cricketer
Follow us
Basha Shek

|

Updated on: May 14, 2024 | 5:42 PM

ఆదివారం (మే 12) మాతృదినోత్సవం సందర్భంగా అందరూ తమ తల్లులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇందులో సినీ ప్రముఖులు, స్టార్ క్రికెటర్లు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసుకుని విషెస్ చెప్పారు. మరికొందరు తల్లులతో తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో వారు షేర్ చేసిన ఫొటోలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో ఉన్న పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టీమిండియా సూపర్ స్టార్. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే తన అద్భుత బ్యాటింగ్ తో రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తున్నాడు. సచిన్ వారసుడిగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు. అంతేకాదు భవిష్యత్ లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా పగ్గాలు అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. మరి ఈ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు టీమిండియా ప్రిన్స్ శుభ మన్ గిల్.

మాతృదినోత్సవం సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు తమ తల్లులకు విషెస్ తెలియజేశారు. శుభ్ మన్ గిల్, సచిన్ టెండూల్కర్, బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, సైనా నెహ్వాల్‌, అశ్విని పొన్నప్ప, టెన్నిస్‌ ప్లేయర్‌ మనికా బాత్రా, మీరాబాయి చాను తదితరులు తమ తల్లులతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వారికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శుభ్ మన్ గిల్ చిన్నప్పుడు తన తల్లితో కలిసి దిగిన అరుదైన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీనికి మమ్మీ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇందులో ఎంతో క్యూట్ గా కనిపించాడు గిల్. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక గిల్ సారథ్యం వహిస్తోన్న గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2024 నుంచి నిష్ర్కమించింది. సోమవారం ( మే 13) కోల్ కతాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ కలలు ఆవిరయ్యాయి.

ఇవి కూడా చదవండి

చిన్నప్పుడు తల్లితో శుభ్ మన్ గిల్..

ఐపీఎల్ నుంచి గుజరాత్ టైటాన్స్ ఔట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..