AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush- Karthi: హీరో ధనుష్ మంచి మనసు.. నటుడు కార్తీకి కోటి రూపాయల చెక్.. ఎందుకో తెలుసా?

ప్రముఖ తమిళ నటుడు ధనుష్ ఇటీవల పలు కారణాలతో వార్తల్లో నిలుస్తున్నాడు . ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల విరాళమిచ్చాడీ స్టార్ హీరో. కోలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీకి కోటి రూపాయల చెక్ అందించాడు ధనుష్ . ఏంటి? ధనుష్ ఇంత భారీ మొత్తం కార్తీకి ఎందుకు విరాళంగా ఇచ్చాడు? అనుకుంటున్నారా?

Dhanush- Karthi: హీరో ధనుష్ మంచి మనసు.. నటుడు  కార్తీకి కోటి రూపాయల చెక్.. ఎందుకో తెలుసా?
Dhanush, Karthi
Basha Shek
| Edited By: Rajeev Rayala|

Updated on: May 14, 2024 | 12:23 PM

Share

ప్రముఖ తమిళ నటుడు ధనుష్ ఇటీవల పలు కారణాలతో వార్తల్లో నిలుస్తున్నాడు . ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల విరాళమిచ్చాడీ స్టార్ హీరో. కోలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీకి కోటి రూపాయల చెక్ అందించాడు ధనుష్ . ఏంటి? ధనుష్ ఇంత భారీ మొత్తం కార్తీకి ఎందుకు విరాళంగా ఇచ్చాడు? అనుకుంటున్నారా? ఈ డబ్బంతా కళాకారుల కోసం! అవును, నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణానికి 1 కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు ధనుష్. ఈ సందర్భంగా ఆయనకు నడిగర్ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ధనుష్ చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలిగిపోతున్నాడు. ఒక్కో సినిమాకు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక సినిమాలతో పాటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటాడీ హీరో. అందుకు నిదర్శనంగా ఇప్పుడు కోటి రూపాయల విరాళం ఇచ్చాడు. దీనికి సంబంధించిన చెక్ ను కార్తీకి అందించాడు. ప్రస్తుతం వీరిద్దరి కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిందిజ. ధనుష్ చేసిన పనిని అభిమానులు, సెలబ్రిటీలు ప్రశంసిస్తున్నారు.

చెన్నైలో సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం కొత్త భవనం నిర్మిస్తున్నారు. అందుకు విరాళాలు సేకరిస్తున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ నాసర్, కోశాధికారి కార్తీలకు ధనుష్ చెక్ అందించారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఈ ఆలోచనను ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. గతంలో కమల్ హాసన్, దళపతి విజయ్ కూడా కళాకారుల సంఘానికి కోటి రూపాయల విరాళం అందించారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విశాల్ ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియాలో కమల్ హాసన్, దళపతి విజయ్ లకు ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది సెలబ్రిటీలు తమ వంతుగా విరాళాలు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమా విషయానికి వస్తే ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా గతేడాది విడుదలై యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ‘కుబేర’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దీంతో పాటు ధనుష్ ‘రేయాన్’ చిత్రంలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.