AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavithra Jayaram: ‘ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా’.. ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం మరణంపై భర్త ఎమోషనల్

ప్రముక బుల్లితెర నటి పవిత్ర జయరామ్ ఆదివారం (మే 12) రోడ్డు ప్రమాదంలో మరణించారు . ఆమె అంత్యక్రియలు సోమవారం (మే 13) కర్ణాటకలోని మండ్యలో జరిగాయి. ఈ సందర్భంగా పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు పవిత్ర అంత్యక్రియలకు హాజరయ్యారు.

Pavithra Jayaram: 'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి పవిత్ర జయరాం మరణంపై భర్త ఎమోషనల్
Pavitra Jayaram Family
Basha Shek
|

Updated on: May 13, 2024 | 8:54 PM

Share

ప్రముక బుల్లితెర నటి పవిత్ర జయరామ్ ఆదివారం (మే 12) రోడ్డు ప్రమాదంలో మరణించారు . ఆమె అంత్యక్రియలు సోమవారం (మే 13) కర్ణాటకలోని మండ్యలో జరిగాయి. ఈ సందర్భంగా పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు పవిత్ర అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆమెకు తుది వీడ్కోలు పలికారు. పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కాగా పవిత్ర జయరామ్ స్నేహితులతో కలిసి కారులో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే యాక్సిడెంట్ లో పవిత్ర భర్త చంద్రకాంత్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో భార్య మరణంపై చంద్ర కాంత్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. నెట్టింట తెగ వైరల్ అవుతోన్న ఈ పోస్ట్ అభిమానులు, నెటిజన్ల మనసులను కలచి వేస్తోంది. ఇందులో పవిత్రతో తాను దిగిన చివరి ఫొటోను షేర్ చేసిన చంద్ర కాంత్..

‘పాపా నీతో దిగిన ఆఖరి పిక్ రా.. నువ్వు నన్ను ఒంటరివాడివి చేశాన్న నిజాన్నిఅసలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్.. నా పవిత్ర ఇక లేదు. ప్లీజ్ మళ్లీ రావా’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చాడు చంద్రకాంత్. ఈ ఫొటోలో భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆనందగా కనిపించారు. అయితే ఇదే వారిద్దరి ఆఖరి సెల్ఫీ అవుతుందని మాత్రం అసలు ఊహించలేకపోయారు. ప్రస్తుతం పోస్ట్ అందరి మనసులను కలచివేస్తోంది. అభిమానులు, నెటిజన్లు పవిత్ర జయరాం కు నివాళి అర్పిస్తున్నారు. అలాగే చంద్రకాంత్ కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. కన్నడలో పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన చేసిన పవిత్ర జయరామ్.. తెలుగులో త్రినయని సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆమె పోషించిన తిలోత్తమ రోల్ తో ప్రశంసలు అందుకుంది. అంతకు ముందు నిన్నేపెళ్లాడతా సీరియల్ లోనూ నటించింది పవిత్రా జయరామ్.

ఇవి కూడా చదవండి

చంద్ర కాంత్ ఎమోషనల్ పోస్ట్..

పవిత్ర జయరామ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ట్రెండీ డ్రెస్ లో త్రియయని నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.