Brahmamudi, May 14th episode: కళావతి ముద్దు గోల.. అనామిక నా భార్యే కాదన్న కళ్యాణ్..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌తో రొమాన్స్ చేయాలని అనామిక అనుకుంటుంది. కానీ కళ్యాణ్‌ మాత్రం అరెస్ట్ గురించి ప్రస్తావన తీసుకొస్తాడు. జరిగిపోయిన దాని గురించి ఎందుకు.. నేను నీతో మంచిగా, ప్రేమగా ఉండాలని ఆశ పడుతున్నానని అనామిక అంటే.. నీకు ఒక్కదానికే అనిపిస్తే సరిపోతుందా.. నాకూ అనిపించాలి కదా.. మనసు లేదని కళ్యాణ్ అంటాడు. ప్లీజ్ కళ్యాణ్ జరిగింది మర్చిపో..

Brahmamudi, May 14th episode: కళావతి ముద్దు గోల.. అనామిక నా భార్యే కాదన్న కళ్యాణ్..
Brahmamudi
Follow us

|

Updated on: May 14, 2024 | 12:25 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌తో రొమాన్స్ చేయాలని అనామిక అనుకుంటుంది. కానీ కళ్యాణ్‌ మాత్రం అరెస్ట్ గురించి ప్రస్తావన తీసుకొస్తాడు. జరిగిపోయిన దాని గురించి ఎందుకు.. నేను నీతో మంచిగా, ప్రేమగా ఉండాలని ఆశ పడుతున్నానని అనామిక అంటే.. నీకు ఒక్కదానికే అనిపిస్తే సరిపోతుందా.. నాకూ అనిపించాలి కదా.. మనసు లేదని కళ్యాణ్ అంటాడు. ప్లీజ్ కళ్యాణ్ జరిగింది మర్చిపో అని అనామిక అంటుంది. అప్పుడే కళ్యాణ్ ఓ ఫ్లవర్ వాజ్ తీసుకురమ్మని కింద పడేయమంటాడు. దీంతో ఫ్లవర్ వాజ్ పగిలిపోతుంది. దానికి సారీ చెప్పమని అంటే.. సరే అని అనామిక సారీ చెప్తుంది. అతుక్కుందా అని కళ్యాణ్ అడుగుతాడు.. సారీ చెప్తే ఎలా అతుక్కుటుందని అనామిక అడిగితే.. నా మనసు కూడా అంతే అనామిక ఒక్కసారి విరిగిన మనసు ఎలా అతుక్కుంటుంది. ఎప్పుడూ నీకు ఇష్టం వచ్చినట్టుగానే నేను ఉండాలని కోరుకుంటావ్. ఇప్పటికీ నువ్వు నన్ను ఓ మిషన్‌లా మాత్రమే చూస్తున్నావని కళ్యాణ్.. అనామికపై సీరియస్ అవుతాడు.

కళావతి ముద్దు గోల..

ఇక ఈ సీన్ కట్ చేస్తే తెల్లవారుతుంది. కావ్య రెడీ అయి.. రాజ్ ఇవ్వాలనుకున్న బొకేకు ఉన్న గ్రీటింగ్ కార్డ్ చూసి సంతోష పడుతుంది. రాజ్‌ దగ్గరకు వెళ్లి సిగ్గు పడుతుంది. రాజ్‌కి ముద్దు పెట్టాలని ట్రై చేస్తుంది. కానీ భయపడుతుంది. అప్పుడే కావ్యలో ఉండే ఆత్మ బయటకు వచ్చి నవ్వుతుంది. భర్తకు ఇంతకాలం దూరంగా ఉంటే ఇలానే ఉంటుదని అంటుంది. నీ భర్త మనసులో నువ్వు ఉన్నావని అర్థమైంది కదా.. అప్పుడు ఇంకో బిడ్డను తీసుకొచ్చి ఇంకో ఉయ్యాల్లో పడుకోబెడతాడని అంటాడు. అందుకే ధైర్యంగా వెళ్లి ఓ ముద్దు పెట్టేయ్ అని అంటుంది. అమ్మో నేనా అని కావ్య భయపడుతుంది. నేను పెట్టను బాబోయ్ అని కావ్య అంటుంది. ఈ లోపు కావ్య ఆత్మ వెళ్లి ముద్దు పెడుతుంది. దీంతో కావ్య సిగ్గు పడుతుంది. అప్పుడే రాజ్ నిద్ర లేచి ఏంటిది నా బట్టలు అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా.. ఎందుకు సిగ్గు పడుతుందని అడుగుతాడు. కానీ కావ్య మాత్రం పరిగెత్తుకుంటూ పారిపోతుంది. దీనికేమైనా పిచ్చి పట్టిందా అని రాజ్ అనుకుంటాడు.

చిచ్చు రాజేసిన రుద్రాణి..

ఆ తర్వాత కళ్యాణ్ హాలులో కూర్చుని కవితలు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే పై నుంచి వచ్చిన రుద్రాణి.. అనామిక ఇది చూస్తే ఇల్లు పీకి పందిరి వేస్తుంది. అలాగే ఇదే మంచి ఛాన్స్ వీడు ఆఫీసుకు వెళ్లడు. ఈ వంకతో రాహుల్‌ని ఆఫీస్‌కి ఎండీ చేయవచ్చు అని వెళ్లి.. బయట ఉన్నా అనామికతో నీ మొగుడు ఆఫీస్‌కి వెళ్లకుండా కవితలు రాసుకుంటూ కూర్చొన్నాడు వెళ్లి కడిగి పారేయ్ అని అంటుంది. ఇక లోపలికి వచ్చిన అనామిక.. కళ్యాణ్ కొట్టిన చెంప దెబ్బ గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. ఏయ్ ఏంటి ఎందుకు ఆగిపోయావ్ అని నీ మొగుడు మరో చెంప దెబ్బ కొడతాడని అనుకుంటున్నావా అని రుద్రాణి అంటుంది. నేను కాదు.. అడగాల్సిన వాళ్ల చేత అడిగిస్తా.. అని కిచెన్‌లో ఉన్న ధాన్య లక్ష్మి దగ్గరకు వెళ్తుంది అనామిక. కళ్యాణ్ ఆఫీస్‌కి వెళ్లకుండా.. కవితలు రాసుకుంటూ కూర్చొన్నాడని చెప్తుంది.

ఇవి కూడా చదవండి

కట్టలు తెంచుకున్న కళ్యాణ్ ఆవేశం..

దీంతో ధాన్య లక్ష్మి కళ్యాణ్ దగ్గరకు వస్తుంది. అప్పుడే కళ్యాణ్.. కళ్యాణ్ అని గట్టిగా పిలుస్తుంది. ఆ అరుపులకు ఇంట్లో ఉన్నవారంతా బయటకు వస్తారు. కానీ కళ్యాణ్ మాత్రం అస్సలు పలకడు. అలాగే రాసుకుంటూ కూర్చొంటాడు. ఇక అప్పుడు రుద్రాణి.. నాన్నా కళ్యాణ్ అని సుతి మెత్తగా పిలుస్తుంది. ఏంటి అత్తా.. అని కళ్యాణ్ అంటాడు. నీ భార్య ఇందాకటి నుంచి పిలిస్తే పలకడం లేదా అని అడుగుతుంది. నేను ఇంకా పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయే మో అనుకున్నా అత్తా. ఇక్కడే ఉన్నాను కదా అని కళ్యాణ్ అంటాడు. సరేరా.. ఆఫీస్‌కు ఎప్పుడు వెళ్తావ్? అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆఫీస్‌కి నేనెందుకు వెళ్తాను? వెళ్తే అన్నయ్య లేదంటే వదిన వెళ్తారు. కానీ నేను మాత్రం వెళ్లను. ఈ రోజు నుంచి నాకు నచ్చిన పనిని చేసుకుంటూ కూర్చొంటానని కళ్యాణ్ అంటాడు. ఆఫీస్‌కి ఎందుకు వెళ్లవు? అని అనామిక అడిగితే.. నువ్వెవరు? ఓహో నువ్వు నా భార్యవా.. నేను నీ భర్తనా? అమ్మా నువ్వు కానీ, ఇంట్లోవాళ్లు ఎవరైనా ఎప్పుడైనా వాళ్ల భర్తల మీద పోలీస్ కేసు పెట్టారా? అని కళ్యాణ్ అడిగితే.. ఏ భార్యా.. ఏ భర్త మీద పోలీస్ కేసు పెట్టరు. అనామిక మాత్రమే పోలీస్ కేసు పెట్టిందని ప్రకాశం చెప్తాడు. అలాంటప్పుడు తను నా భర్య ఎలా అవుతుందని కళ్యాణ్ అంటాడు.

అనామిక నా భార్యనే కాదు..

ఎవరూ చూసుకోకపోతే కంపెనీ ఏం అవుతుంది? అని ధాన్య లక్ష్మి అంటే.. నువ్వు ఎప్పటి నుంచి కంపెనీ బాగోగులు పట్టించుకుంటున్నావ్? అని ప్రకాశం అంటాడు. కంపెనీ బాగోగులు పట్టించుకోకుండా.. నేను మాత్రం ఎదిగిపోలేదు మావయ్య గారూ.. కానీ నా భర్త ప్రయోజకుడై ఆఫీస్ బాధ్యతలు తీసుకోవాలి అనుకోవడంలో తప్పు ఉందా? అని అడుగుతుంది అనామిక. అందులో ఏం తప్పు లేదమ్మా.. కానీ నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు. అలాంటి వాడిపై కేసు పెట్టడం మాత్రం తప్పు అని ప్రకాశం అంటాడు. ఇప్పుడు ఆ కేసుకు, ఆఫీస్‌కి సంబంధం ఏంటని అనామిక అడిగితే.. ఉంది.. నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్? అనుకున్నా.. కానీ నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఏ కార్లలో తిరగాలి? ఎన్ని కార్డులు ఉండాలి అనేదే నీకు ముఖ్యం. నేనుగా నీకు నచ్చనప్పుడు.. నువ్వు భార్యగా నాకు ఎలా కనిపిస్తావ్? నన్ను జైలుకు పంపించాలి అనుకున్నావ్. అలాంటప్పుడు నిన్ను భార్యలా ఎలా ఒప్పుకుంటాను? నీ మాటకు నేనెందుకు విలువ ఇస్తాను? అని కళ్యాణ్ తెగేసి చెప్పేస్తాడు.

అపర్ణపై కళ్యాణ్ సీరియస్..

ఇలా ఎవరూ ఆఫీస్‌కి వెళ్లకపోతే కంపెనీ ఏమౌతుందిరా? అని అపర్ణ అడిగితే.. అది నా సమస్య కాదురా.. నీ సమస్య. నువ్వే అన్నయ్య వెళ్లకూడదని నిబంధన విధించావ్. కాబట్టి కంపెనీ గురించి మాట్లాడేముందు.. నువ్వే ఒకసారి ఆలోచిస్తే మంచిదని కళ్యాణ్ అంటాడు. దీంతో కళ్యాణ్ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!