Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. డిసెంబర్ 31 కోసం భారీ ఏర్పాట్లు
ఉదయం 10 నుంచి 11గంటల ప్రాంతంలో గుట్టలో భారీ రద్దీ కనిపించింది. కొండ కింద రింగ్ రోడ్డులో నుంచి మూడవ ఘాట్ రోడ్డు మార్గమంతా వాహనాలతో నిండిపోయింది. కొండపైన ఆలయ పరిసరాలు, ముఖమండపం, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు వంటి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. వారాంతాల్లో కనిపించే రద్దీ కంటే నిన్న ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

తెలంగాణ తిరుపతి యాదగిరి గుట్ట భక్తుల రద్దీతో కిక్కిరిపోయింది. సంవత్సరాంతపు సెలవులు, క్రిస్మస్ పండుగ వంటి శుభ దినాలు కలిసి రావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు బారుతీరారు. ఉదయం తెల్లవారు జాము నుంచే ఆలయ సముదాయం రద్దీగా మారింది.. హైదరాబాద్, వరంగల్, చుట్టుపక్కల జిల్లాల నుండి TSRTC బస్సులు, ప్రైవేట్ వాహనాలు భారీగా రావడంతో పార్కింగ్ ప్రాంతాలు, VVIP సూట్‌లు, పుష్కరిణి సమీపంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఉదయం 10 నుంచి 11గంటల ప్రాంతంలో గుట్టలో భారీ రద్దీ కనిపించింది. కొండ కింద రింగ్ రోడ్డులో నుంచి మూడవ ఘాట్ రోడ్డు మార్గమంతా వాహనాలతో నిండిపోయింది. కొండపైన ఆలయ పరిసరాలు, ముఖమండపం, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు వంటి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. వారాంతాల్లో కనిపించే రద్దీ కంటే నిన్న ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక క్యూలు, వీఐపీ దర్శన కౌంటర్లు, 24 గంటలూ అన్నదానం (ఉచిత భోజనం) ఏర్పాట్లు ఉన్నాయని, ఆన్‌లైన్ దర్శన స్లాట్లు వేగంగా నిండిపోతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీ సుదర్శన హోమం కూడా పూజారులు నిర్వహించారు.
ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల కారణంగా 2026 జనవరి 1 వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. వెంకట్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 30న జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరి గుట్టలో ఇప్పటికే సన్నాహాలు ముమ్మరం చేశారు ఆలయ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




