Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Singh: ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి.. నెటిజన్లకు బుల్లితెర నటి రిక్వెస్ట్.. ఎందుకంటే..

ఇక్కడ మాత్రం ఓ బుల్లితెర నటి తనను ట్రోల్ చేయమని అభిమానులకు రిక్వెస్ట్ చేస్తుంది. ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి అంటూ పోస్టులు పెడుతుంది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ? తనే దీపికా సింగ్. ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈతరం ఇల్లాలు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ బీటౌన్ బ్యూటీ. అప్పట్లో ఈ సీరియల్ సంచలనం.

Deepika Singh: ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి.. నెటిజన్లకు బుల్లితెర నటి రిక్వెస్ట్.. ఎందుకంటే..
Deepika Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2024 | 3:25 PM

సాధారణంగా సినీ తారలను నెట్టింట ట్రోల్ చేయడం కామన్. సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ తమ సినిమా అప్డేట్స్, పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు సెలబ్రెటీస్. కానీ కొన్నిసార్లు తారలు చేసిన పోస్టులను ఫన్నీగా ట్రోల్స్, మీమ్స్ చేస్తుంటారు. అయితే తమ గురించి వచ్చే ట్రోల్స్, విమర్శలను కొందరు అస్సలు పట్టించుకోరు. మరికొందరు మాత్రం వెంటనే రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ కౌంటరిస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ బుల్లితెర నటి తనను ట్రోల్ చేయమని అభిమానులకు రిక్వెస్ట్ చేస్తుంది. ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి అంటూ పోస్టులు పెడుతుంది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ? తనే దీపికా సింగ్. ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈతరం ఇల్లాలు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ బీటౌన్ బ్యూటీ. అప్పట్లో ఈ సీరియల్ సంచలనం.

ఈతరం ఇల్లాలు సీరియల్లో సంధ్య పాత్రలో అమాయకమైన.. తెలివైన అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. ఈ సీరియల్ తర్వాత మళ్లీ ఏ సీరియల్ చేయలేదు. పెళ్లి, పిల్లలు అంటూ కొన్నాళ్లు కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన దీపికా.. ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పాటలకు డాన్స్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తుంది. అయితే చాలాసార్లు దీపికా పోస్ట్ చేసిన వీడియోస్ పై ట్రోల్స్ జరిగాయి. అలాగే నెటిజన్స్ ఓ రెంజ్ లో సీరియస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఓ పాటకు డాన్స్ చేసి ఇన్ స్టాలో షేర్ చేసింది దీపికా. “దీనికి యస్.. ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది. ప్లీజ్ ఇప్పుడు నన్ను ట్రోల్ చేయండి” అంటూ సరదాగా రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్.. మీరు ఇలాగే డాన్స్ చేస్తూ ఉండండి.. సంతోషాన్ని పంచండి. బ్యూటిఫుల్ ట్రోల్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. పట్టంచుకోవద్దు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం దీపికా సింగ్ వీడియో నెట్టింట వైరలవుతుంది.

అయితే ఇప్పటికే తన వీడియోస్ పై ట్రోలింగ్ చేస్తున్నవాళ్లకు ఇలా వెరైటీగా కౌంటరిచ్చిందని అంటున్నారు ఆమె అభిమానులు. ప్రస్తుతం ద రియల్ సోల్ మేట్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టింది దీపికా. అలాగే మంగళ్ లక్ష్మి అనే హిందీ సీరియల్లో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.