Brahmamudi, May 15th episode: అనామికను ‘ఉంటే ఉండు పోతే పో’ అన్న కళ్యాణ్.. కావ్య కిడ్నాప్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు కళ్యాణ్. నువ్వే అన్నయ్యని ఆఫీస్‌లో నుంచి వెళ్లగొట్టావ్. అన్నయ్య ఒక్కడే ఆ సీటుకు అర్హుడు అని తెలిసి కూడా అటువంటి మనిషిని ఆ స్థానం నుంచి దింపేశావ్. కాబట్టి కంపెనీ గురించి మాట్లాడే ముందు.. నువ్వే ఒకసారి ఆలోచిస్తే మంచిది అని అంటాడు. దీంతో అపర్ణ గట్టిగా.. కళ్యాణ్ అని అరుస్తాడు. ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావ్. చిన్నవాడైనా సరిగ్గా చెప్పాడు. ఏడాది క్రితం రాజే సరైన వాడని అందరం కలిసి..

Brahmamudi, May 15th episode: అనామికను 'ఉంటే ఉండు పోతే పో' అన్న కళ్యాణ్.. కావ్య కిడ్నాప్!
Brahmamudi
Follow us

|

Updated on: May 15, 2024 | 12:34 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అపర్ణకు వ్యతిరేకంగా మాట్లాడతాడు కళ్యాణ్. నువ్వే అన్నయ్యని ఆఫీస్‌లో నుంచి వెళ్లగొట్టావ్. అన్నయ్య ఒక్కడే ఆ సీటుకు అర్హుడు అని తెలిసి కూడా అటువంటి మనిషిని ఆ స్థానం నుంచి దింపేశావ్. కాబట్టి కంపెనీ గురించి మాట్లాడే ముందు.. నువ్వే ఒకసారి ఆలోచిస్తే మంచిది అని అంటాడు. దీంతో అపర్ణ గట్టిగా.. కళ్యాణ్ అని అరుస్తాడు. ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నావ్. చిన్నవాడైనా సరిగ్గా చెప్పాడు. ఏడాది క్రితం రాజే సరైన వాడని అందరం కలిసి వాడికి పట్టాభిషేకం చేయించాం. అప్పుడు వాడు వద్దు అన్నావ్.. ఇప్పుడు వీడు నాకు వద్దు అనుకుంటున్నాడు. ఎవరూ వద్దు అనుకుంటే కంపెనీ మాత్రం ఎలా నడుస్తుంది. ఆ సమస్య కళ్యాణ్‌ది ఎలా అవుతుందని సుభాష్ అంటాడు. సారీ పెద్దమ్మ.. అయోధ్యని ఎంత మంది రాజ్యం ఏలినా.. ఇప్పటికీ అది రామ రాజ్యమే అని అంటారు. అన్నయ్య ఆ స్థానంలో ఉంటేనే కంపెనీ నిలబడుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి కళ్యాణ్ వెళ్లి పోతూ.. పెళ్లాం అనామికకు వార్నింగ్ ఇచ్చి ఇస్తాడు. ఉంటే ఉండు.. పోతే పో.. అని అంటాడు.

ఇకపై ఎవ్వర్నీ క్షమించను..

ఇంతకు ముందు ఈ ఇల్లు ఇలా లేదు. ఒకరు అంటే ఒకరికి భయం, గౌరవం ఉండేది. ఇప్పుడు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకునే సరికి.. ఎవరూ ఎవరి మాటా వినడం లేదు. ఇది నేను చిన్న వాళ్లకే కాదు.. పెద్ద వాళ్లకు కూడా అర్థం కావాలని చెప్తున్నా. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. దానికి కారణం అయిన ఎవ్వర్నీ నేనూ నా బావా క్షమించేదే లేదని వార్నింగ్ ఇస్తుంది ఇందిరా దేవి. ఈ సీన్ కట్ చేస్తే రాహుల్ ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు రుద్రాణి వచ్చి నీకు మంచి అవకాశం వచ్చింది. కళ్యాణ్ ఆఫీస్‌కి వచ్చే రానని చెప్పేశాడు.. రాజ్ రాడు.. కావ్య వచ్చే పరిస్థితుల్లో లేదు. ఇక నీకు మాత్రమే అవకాశం ఉంది. నువ్వు ఒక్కడివే ఆఫీస్‌ని హ్యాండిల్ చేయగలవని నిరూపించుకో.. వంకర బుద్ధులు చూపించకు అని అంటుంది.అప్పుడే స్పప్న వచ్చి చాలా ఆశ్చర్యంగా ఉందే.. మీరు మంచి నీతులు చెబుతున్నారా అని అంటే.. అప్పుడు రాహుల్ ఆవేశంలో డబ్బు గురించి మాట్లాడబోతుండగా.. రుద్రాణి ఆపుతుంది. ఆ డబ్బేంటి? కోటి రూపాయాలు పోయాయిగా.. దొరకలేదా అని స్వప్న అడిగితే.. ఏ గాడిద ఎత్తుకెళ్లిందో దొరకడం లేదని రాహుల్ అంటాడు. దొరికినా కూడా ఆ గాడిదను నువ్వేం చేయలేవని అంటుంది స్వప్న.

మాయ కోసం కావ్య వేట..

ఈ సీన్ కట్ చేస్తే.. సుభాష్ దగ్గరకు వస్తుంది కావ్య. మావయ్య గారూ.. కంపెనీ బాధ్యతల నుంచి ఆయన్ని అత్తయ్య తిప్పుకోమన్నారు. ఇప్పుడు కవి గారు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు రాహుల్ ఆఫీస్‌కి వెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని కావ్య అంటే.. ఏం చేయాలో నువ్వన్నా ఓ ఐడియా ఇవ్వు అమ్మా అని సుభాష్ అంటాడు. అసలు బాబు విషయంలో.. బాబు తల్లి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయని కావ్య అంటుంది. ఏ విషయంలో అని అడుగుతుంది. ఆ బిడ్డ తల్లి ఎందుకు బిడ్డతో పాటు రాలేదు. ఎందుకు ఆయనతో పాటు పంపించింది. ఏ కన్న తల్లి కూడా పాలు తాగే పిల్లాడిని వదిలి ఉండలేదు కదా.. అసలు ఆమె ఏం కోరుకుంటుంది? అని కావ్య అడుగుతుంది. డబ్బు.. అవునమ్మా.. ముందు ఆ మాయ.. నా సెక్రటరీగా ఊటీ బ్రాంచ్‌లో పని చేసింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత బిడ్డను తీసుకుని వచ్చి న్యాయం చేయమని కోరింది. లేకపోతే నా కుటుంబం ముందుకు తీసుకొచ్చి జరిగింది చెప్తానని బెదిరించింది. అందుకే నేను సూసూడ్ చేసుకోవాలని అనుకున్నా. అప్పుడే రాజ్ వచ్చి ఆపాడు. జరిగింది తెలుసుకుని.. మాయ దగ్గరకు వెళ్లి తన బిడ్డగా తీసుకొచ్చాడని సుభాష్ చెప్తాడు. సరే మీరు ఆ మాయకు డబ్బు పంపిస్తున్నారా? అని అడిగితే.. పంపిస్తున్నాను.. రెండు రోజుల క్రితమే వేశాను. సరే ఆ అకౌంట్ అడ్రెస్ డీటైల్స్ పంపిస్తారా? అని కావ్య అడుగుతుంది. సరే నీకు మెసేజ్ చేస్తానని సుభాష్ చెప్తాడు. సరే మీరు ఈ నిజం అత్తయ్యకు చెప్పాలన్న ఆరాటం మానుకోండని కావ్య చెప్పి వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

కావ్య కిడ్నాప్.. రాజ్‌కు తెలిసిపోయిన నిజం..

ఈ లోపు రాజ్ ఆలోచనలో పడతాడు. కళావతి ఎలాగైనా బిడ్డను తీసుకొచ్చి అందరి ముందూ నిలబెడుతుంది. అది జరగకుండా ఉండాలంటే.. ఇప్పుడు డబ్బులు ఇచ్చి.. బిడ్డ తల్లి చనిపోయిందని చెప్పాలి అని బయటకు వెళ్లబోతుండగా.. కావ్య కూడా వెళ్తుంది. అది చూసి రాజ్ ఏయ్ ఆగు.. ఎక్కడికి వెళ్తున్నావ్? అని రాజ్ అడిగితే.. మీరెక్కడికి వెళ్తున్నారు? అని కావ్య రివర్స్‌గా సమాధానం చెప్తుంది. ఇలా కాసేపు వీరిద్దరి సంభాషణ కొనసాగుతుంది. రాజ్ ఓ కారులో.. కావ్య మరో కారులో బయటకు బయలు దేరతారు. కావ్య తనని ఫాలో చేస్తుందని రాజ్ అనుంటాడు. దీంతో రాజ్ టర్నింగ్ తీసుకుంటాడు. ఈలోపు కావ్య వేరే వైపు వెళ్తుంది. హమ్మయ్య అనుకుంటాడు రాజ్. కట్ చేస్తే.. ఇద్దరూ ఒకే ప్లేస్‌కి వెళ్తారు. కావ్య నడుచుకుంటూ వెళ్తూ.. మాయ అడ్రెస్ కనుక్కుంటుంది. రాజ్ వెనకాలే వస్తూ ఉంటాడు. ఈలోపు కావ్యను చూసిన ఓ పోకిరీ బ్యాచ్.. అరే మంచి ఫిగర్ వస్తుందిరా అని ఫొటో తీసి వేరే అతనికి పంపిస్తాడు. కిడ్నాపర్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తూ.. వేరే వాళ్లకు అమ్ముతూ ఉంటాడు. కిడ్నాపర్.. ఫోన్ చేసి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఐదు లక్షలు ఇస్తానని చెప్తాడు. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో.. కావ్యని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తారు. అది చూసి అప్పూ వెనుకే ఫాలో అవుతుంది.