AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patang Movie Review : పతంగ్ మూవీ రివ్యూ.. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో అమ్మాయి రాక.. యూత్ ఫుల్ డ్రామా ఎలా ఉందంటే..

సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు, పందెం, సందడి. ఈ కల్చర్‌ని, స్నేహాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే పతంగ్. కొత్త నటీనటులతో, సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది.

Patang Movie Review : పతంగ్ మూవీ రివ్యూ.. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో అమ్మాయి రాక.. యూత్ ఫుల్ డ్రామా ఎలా ఉందంటే..
Patang
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Dec 26, 2025 | 10:08 AM

Share

మూవీ రివ్యూ: పతంగ్

నటీనటులు: వంశీ పూజిత్, ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, విష్ణు ఓయ్, ఎస్పీబీ చరణ్, అను హాసన్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు.

సంగీతం: జోస్ జిమ్మీ

సినిమాటోగ్రఫీ: శక్తి అరవింద్

దర్శకత్వం: ప్రణీత్ ప్రతిపాటి

నిర్మాతలు: విజయశేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ రెడ్డి, నాని బండ్రెడ్డి

సంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు, పందెం, సందడి. ఈ కల్చర్‌ని, స్నేహాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే పతంగ్. కొత్త నటీనటులతో, సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

అరుణ్ (ప్రణవ్ కౌశిక్), విస్కీ (వంశీ పూజిత్) చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరి ప్రపంచం చాలా సరదాగా సాగిపోతుంటుంది. అయితే వీరి జీవితాల్లోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ఎంట్రీ ఇస్తుంది. ఐశ్వర్య రాకతో ఈ ముగ్గురి మధ్య సమీకరణాలు ఎలా మారాయి..? స్నేహం, ప్రేమ మధ్య ఏర్పడిన ఘర్షణలో పతంగ్ పోటీ ఎందుకు కీలకంగా మారింది..? చివరికి ఐశ్వర్య మనసును ఎవరు గెలుచుకున్నారు..? వీళ్ళ మధ్యలోకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎందుకు వచ్చాడు అనేది అసలు కథ..

కథనం:

దర్శకుడు ప్రణీత్ ప్రతిపాటి ఒక సింపుల్ పాయింట్‌ని తీసుకుని, దానికి ఎమోషన్ స్పోర్టివ్ స్పిరిట్‌ని జోడించి తీసిన విధానం బాగుంది. కథలో పెద్దగా ట్విస్టులు లేకపోయినా.. ఫ్రెండ్‌షిప్ మూమెంట్స్, హైదరాబాద్ కల్చర్‌ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అరుణ్, విస్కీల మధ్య స్నేహం, వారి అల్లరి, లవ్ ట్రాక్‌తో సరదాగా సాగిపోతుంది. కాకపోతే వాళ్ళ చైల్డ్ హుడ్ సీన్స్ అంత లెంత్ అవసరం లేదు అనిపించింది. సెకండాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది. గాలిపటాల పోటీ, అందులో ఉండే ఎమోషన్స్ సినిమాకి ప్రధాన బలం. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్ సరదాగా ఉన్నాయి. అయితే కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు ఉండటం, తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేలా ఉండటం కాస్త మైనస్. టాలీవుడ్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఇప్పటి వరకు చాలా వచ్చాయి.. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించే కథలు మనకు కొత్త కాదు.. కానీ ఒక అమ్మాయి ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో పడడం అనేది మాత్రం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. నాటి ప్రేమదేశం.. నిన్నటి బేబీ అలాంటి కథలే.. కాకపోతే అందులో కథ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అదే కథను లైటర్ నోట్ లో తీస్తే అదే పతంగ్. హైదరాబాద్ బేస్ కథ కాబట్టి పతంగ్ రేస్ ఎంచుకున్నాడు దర్శకుడు. చివరి 40 నిమిషాల సై నుంచి ఇన్ స్పైర్ అయ్యారు.

నటీనటులు:

ప్రణవ్ కౌశిక్ లవర్ బాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో చాలా పరిణితి చూపించాడు. వంశీ పూజిత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇంటెన్సిటీని బాగా పండించాడు. ప్రీతి పగడాల స్క్రీన్ మీద అందంగా కనిపించడమే కాకుండా, తన నటనతో ఆకట్టుకుంది. విష్ణు ఓయ్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించగా, ఎస్పీబీ చరణ్, అను హాసన్ తమ పాత్రలతో మెప్పించారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. శక్తి అరవింద్ కెమెరా పనితనం సూపర్. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా క్రిస్ప్‌గా ఉండేది. రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు కాస్త ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు ప్రణీత్ తెలిసిన కథనే కొత్తగా ట్రై చేశాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా పతంగ్.. లెంత్ ఎక్కువైంది.. కానీ పర్లేదు.. యూత్ ఫుల్ డ్రామా..!