Brahmamudi, May 13th episode: ఇందిరా దేవి సలహాతో మాయ కోసం కళావతి వేట.. అనామిక కొత్త ప్లాన్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నిజాన్ని బయట పెట్టే సత్తా నీలో ఉందా? అని అపర్ణ.. కావ్యను ప్రశ్నిస్తుంది. నిజాన్ని బయట పెట్టి.. బిడ్డ తల్లిని తీసుకొచ్చి అందరి ముందూ నిలబెడతానని అంటే.. నేను నా ఇంట్లోనే ఉంటానని అపర్ణ అడుగుతుంది. సరే తీసుకొస్తాను అని కావ్య అంటే.. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉన్నా సరే.. ఆమెను నేను మీ ముందు నిలబెడతానని కావ్య చెపతుంది. సరే చూద్దాం అని చెప్పి అపర్ణ ఇంట్లోకి..

Brahmamudi, May 13th episode: ఇందిరా దేవి సలహాతో మాయ కోసం కళావతి వేట.. అనామిక కొత్త ప్లాన్!
Brahmamudi 2
Follow us

|

Updated on: May 13, 2024 | 12:44 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నిజాన్ని బయట పెట్టే సత్తా నీలో ఉందా? అని అపర్ణ.. కావ్యను ప్రశ్నిస్తుంది. నిజాన్ని బయట పెట్టి.. బిడ్డ తల్లిని తీసుకొచ్చి అందరి ముందూ నిలబెడతానని అంటే.. నేను నా ఇంట్లోనే ఉంటానని అపర్ణ అడుగుతుంది. సరే తీసుకొస్తాను అని కావ్య అంటే.. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉన్నా సరే.. ఆమెను నేను మీ ముందు నిలబెడతానని కావ్య చెపతుంది. సరే చూద్దాం అని చెప్పి అపర్ణ ఇంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత కావ్య, రాజ్‌లు గదిలోకి వెళ్తారు. నీకు అసలు బుద్ధి ఉందా? అసలు మీకు ఏమన్నా అర్థమవుతుందా.. అని రాజ్ కావ్యని ప్రశ్నిస్తాడు. నాకు తెలిసింది.. అర్థమైంది మీకు అర్థం కాలేదా? అని కావ్య అడుగుతుంది. మా అమ్మని ఆపుతానని చెప్పి.. ఏం చేశావ్ నువ్వు.. ఆపడానికి ఇదేనా దారి. నువ్వు అనుకున్నది జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? అని రాజ్ అడుగుతాడు.

‘నిజం’ కోసం కావ్య – రాజ్‌ల రచ్చ..

ఏ మీకు నమ్మకం లేదా? తల్లి లేకుండా పుట్టాడా? వాడు? కన్న తల్లి ఎక్కడో చోట ఉంటుంది కదా. ఇంట్లోంచి బిడ్డను తీసుకుని.. సోలోగా సూట్ కేస్ పట్టుకుని పోతున్నారు? ఏడాది క్రితం పెళ్లి అయిందన్న విషయం మర్చిపోయారా? నా దారిన నన్ను ఈ ఇంట్లో బానిసలా, పనిమనిషిలా వదిలేసి అలా ఎలా వెళ్లిపోతారు? మీ వెనుకే నేను వస్తానని చెప్పాను కదా? ఏం అనుకుని మీ దారిన మీరు బయలు దేరారు? నా సమాధానం కావాలి? లేదంటే ఈ విషయంలో నన్ను క్షమించను కావ్య రాజ్‌ని ప్రశ్నిస్తుంది. నేనేం అడుగుతున్నా? నువ్వేం మాట్లాడుతున్నావ్? నేను జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నా దానికి జవాబు చెప్పు అని రాజ్ అంటాడు. నేనేం తప్పూ చేయలేదు. మీ అమ్మ గారిని ఆపడానికి నాకు వేరే దారి లేదని కావ్య అంటాడు. అలాంటప్పుడు నోరు మూసుకుని ఉండాలి అని రాజ్ అంటే.. అబ్బా బాగానే చెప్పారు.. మీరందరూ శిలా విగ్రహాలుగా నిల్చున్నారు. ఒక్కరు కూడా ఆపలేదు. నేనన్నా గడప దాటి ఆపకపోయి ఉంటే.. ఆవిడ బయటకు వెళ్లిపోయేవారని కావ్య అంటుంది. రేపు మా అమ్మ ఊరుకుంటుందా? ఆ నిజం బయట పడితే ఏం జరుగుతుందో తెలుసా? అని చెప్పబోయి రాజ్ ఆగిపోతాడు. మీరు ఏమన్నా అనుకోండి.. ఆవిడ ఎక్కడ ఉన్నా ఇక్కడికే తీసుకొస్తాను అని కావ్య చెప్తుంది.

కావ్య మాటలకు షాక్ అయిన సుభాష్..

ఈ సీన్ కట్ చేస్తే.. కావ్య బటయకు రాగానే సుభాష్ నిలబడి ఉంటాడు. అమ్మా కావ్యా మీ అత్త గారితో నేను మాట్లాడబోతుంటే ఎందుకు అడ్డం పడ్డావో అర్థం కాలేదమ్మా. ఈ సమ్యలకు ఎక్కడ బీజం పడిందో.. దాని గురించి చెప్పాలి అనుకున్నా. నిజం చెప్పాలి అనుకున్నా అని సుభాష్ అంటే.. అందుకే ఆపాను మావయ్య గారూ.. మీరు చెప్పబోయే నిజాన్ని నేను ఊహించాను. నాకు మొత్తం తెలుసు మావయ్య గారూ అని కావ్య అంటే.. సుభాష్ షాక్ అయిపోతాడు. ఆ నిజం మీరు అత్తయ్య గారెతో చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేదో ఏం జరిగి ఉండేదో మీకూ తెలుసు అని కావ్య అంటుంది. ఏ మావయ్య గారూ ఏ కోడిలితోనూ చర్చించలేని తప్పు జరిగి పోయిందమ్మా అని సుభాష్ అంటాడు. క్షమించండి దీని గురించి మీతో మాట్లాడాలంటే ఇబ్బందిగానే ఉంది. అలాగే నాకు నిజం తెలుసన్న విషయం.. మీ అబ్బాయికి తెలీదు. మీరు కూడా చెప్పకండి అని కావ్య చెప్పి వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి

కావ్యపై రుద్రాణి – రాహుల్‌ల కొత్త కుట్ర..

ఆ తర్వాత రుద్రాణి కావ్యపై ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ కావ్య కారణంగా నేను అనుకున్న ప్లాన్ మొత్తం చెడిపోయింది. ఇంతలో రాహుల్ లగేజ్ పట్టుకుని వస్తాడు. ఇక ఈ ఇంట్లోంచి మనం పర్మినెంట్‌గా వెళ్లిపోదామని సర్దేశాను. మనం అనుకున్నది ఏదీ జరగలేదు. ఆ కావ్య ఉండగా మనం అనుకున్నది ఏదీ జరగదు. దాన్ని ఎలాగో ఇంట్లోంచి పంపించలేం. మనంతట మనం వెళ్లిపోతే.. కనీసం మర్యాదైనా దక్కుతుంది. పొరపాటును కావ్య కానీ మనం వెళ్లగొడితే.. మనం బతకడానికి కూడా అవకాశం లేకుండా పోతుందని రాహుల్ అంటాడు. మీ అమ్మని మరీ అంత తక్కువ అంచనా వేయకురా.. ఆ బిడ్డ తల్లిని కనుక కావ్య తీసుకురాకపోతే.. అది ఇంట్లోంచి వెళ్లిపోతుంది. అలా జరిగేలా నేను చేస్తాను. ఆ బిడ్డ తల్లి వచ్చినా.. రాకపోయినా.. కావ్యకే నష్టం జరుగుతుందని రుద్రాణి అంటుంది.

కావ్యకు పెద్దావిడ ఇచ్చిన సలహా..

ఆ నెక్ట్స్.. అపర్ణ అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తుంది కావ్య. అప్పుడే ఇందిరా దేవి వచ్చి.. ఇక్కడువా? అని అడుగుతుంది. ఇప్పుడొచ్చారా? అని కావ్య అడిగితే.. ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తానని ఎందుకు అపర్ణకు మాట ఇచ్చావ్? ఆమె వస్తే నీ పరిస్థితి ఏంటన్న విషయం ఆలోచించావా అని అడుగుతుంది. అత్తయ్యను ఆపడానికి నాకు ఇంకో మార్గం కనిపించలేదని కావ్య అంటుంది. ఆ మంచితనమే నీ కాపురాన్ని కూల్చేసేలా ఉంది. అయినా అదేం ఆడది.. లోకంలో ఎక్కడా లేని విధంగా కొడుకుని ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది. పాలు తాగే పిల్లాడిని అలా వదిలేస్తుందా? నిజంగా తప్పే చేస్తే.. ఆ తల్లి కూడా వచ్చి న్యాయం అడగాలి కదా? అని పెద్దావిడ అంటుంది. దీంతో కావ్య ఆలోచనలో పడుతుంది. ఎలాగైనా ఆ బిడ్డ తల్లిని పట్టుకోవాలని కావ్య వెళ్లిపోతుంది.

కళ్యాణ్‌ని బుట్టలో వేసుకునేందుకు అనామిక కొత్త ప్లాన్..

ఇక అనామిక బాగా సింగారించుకుని.. మంచి సువాసన ఉండే పెర్ఫ్యూమ్ కొట్టుకుని కళ్యాణ్‌ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలో కళ్యాణ్ వస్తాడు. అనామికను చూసి ఏంటి? అని అడుగుతాడు. హా.. బెడ్ షీట్స్ మార్చారు కదా అని కళ్యాణ్ చెప్తాడు. మొద్దు అబ్బాయ్.. నేను దాని గురించి కాదు.. నా పెర్ఫ్యూమ్ గురించి అని చెప్తూ.. కళ్యాణ్ చేయిని ముద్దు పెట్టుకోవాలని చూస్తుంది. కానీ కళ్యాణ్ చేయి తీసేస్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Articles
కొన్నిసార్లు మెంటల్‌గా, కొన్నిసార్లు ఫిజికల్‌గా.. తప్పదు. జాన్వీ
కొన్నిసార్లు మెంటల్‌గా, కొన్నిసార్లు ఫిజికల్‌గా.. తప్పదు. జాన్వీ
సైబర్ నేరగాడి వలలో చిక్కిన ఎమ్మెల్యే..?
సైబర్ నేరగాడి వలలో చిక్కిన ఎమ్మెల్యే..?
కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..? మీరు ప్రమాదంలో పడ్డట్లే.!
కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నారా..? మీరు ప్రమాదంలో పడ్డట్లే.!
పాడుబడిన కోటలో పురాతన ఆలయాల పునర్నిర్మాణం...
పాడుబడిన కోటలో పురాతన ఆలయాల పునర్నిర్మాణం...
దేశంలో ఎక్కడ వరల్డ్ కప్ క్రికెట్ జరిగినా ఆమెకు ఫ్రీ టికెట్...
దేశంలో ఎక్కడ వరల్డ్ కప్ క్రికెట్ జరిగినా ఆమెకు ఫ్రీ టికెట్...
'పంజా' విసిరిన బ్యాటర్లు... హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
'పంజా' విసిరిన బ్యాటర్లు... హైదరాబాద్ ముందు భారీ టార్గెట్
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో
లేడీ పవర్ స్టార్ కి స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి లేదా.?
లేడీ పవర్ స్టార్ కి స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి లేదా.?
ఈ మొక్క అత్యంత విషపూరితమైనది..! తాకితే మంట, తింటే మరణం ఖాయం!!
ఈ మొక్క అత్యంత విషపూరితమైనది..! తాకితే మంట, తింటే మరణం ఖాయం!!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్