AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavitra Jayaram: ఇండస్ట్రీలో విషాదం.. త్రినయని సీరియల్ నటి మృతి..

కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరామ్.. తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది. కన్నడ రోబో ఫ్యామిలీ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టిన పవిత్ర... మాండ్య తాలూకాలోని హనకెరెకు చెందినవారు.

Pavitra Jayaram: ఇండస్ట్రీలో విషాదం.. త్రినయని సీరియల్ నటి మృతి..
Pavitra Jayaram
Rajitha Chanti
|

Updated on: May 12, 2024 | 1:18 PM

Share

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బుల్లితెర నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందినట్లు సమాచారం. కర్ణాటకలోని తన సొంత గ్రామికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఈరోజు తెల్లవారుజామున తన కారు అదుపుతప్పి డివైడర్‏ను ఢీకొట్టి.. కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో పవిత్ర జయరామ్ అక్కడిక్కడే మరణించింది. ఆమెతోపాటు కారులో తన తోటి నటులు, కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, తోటి నటుడు చంద్రకాంత్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరామ్.. తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది. కన్నడ రోబో ఫ్యామిలీ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టిన పవిత్ర… మాండ్య తాలూకాలోని హనకెరెకు చెందినవారు. ‘రోబో ఫ్యామిలీ’, ‘జోకలి’, ‘నీలి’, ‘రాధారామన్’ వంటి కొన్ని సీరియల్స్ లో నటించింది. ఇప్పుడు తెలుగులో త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.