Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. గరుడ సేవకు విచ్చేసే వారికి ఆ ఇబ్బందులు తప్పినట్టే..!

భక్తుల రద్దీ నేపథ్యంలో 5 వేల మంది పోలిసులుతో పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేసినట్టుగా వివరించారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇకపోతే, వేంకటేశ్వర స్వామివారి గరుడ సేవకు వచ్చే భక్తుల కోసం

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. గరుడ సేవకు విచ్చేసే వారికి ఆ ఇబ్బందులు తప్పినట్టే..!
Ttd Eo J Syamala Rao
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 07, 2024 | 9:45 PM

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీ‌నివాసుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. రేపు (అక్టోబర్‌8 మంగళవారం) గ‌రుడ సేవను నిర్వహించనున్నారు. ఇందు కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీ మలయప్ప స్వామి.. విశేష‌మైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారు. తిరుమల గరుడ సేవ రోజున 2 లక్షల మంది భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇఓ శ్యామలరావు తెలిపారు. అదనంగా విచ్చేసే భక్తులను క్యూ లైన్ల ద్వారా అనుమతిస్తామని పేర్కొన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో 5 వేల మంది పోలిసులుతో పటిష్ట భధ్రతా ఏర్పాట్లు చేసినట్టుగా వివరించారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.

ఇకపోతే, వేంకటేశ్వర స్వామివారి గరుడ సేవకు వచ్చే భక్తుల కోసం 400కి పైగా బస్సులు ఏర్పాటు చేసినట్టు ఈవో శ్యామలరావు తెలిపారు. బస్సుల ద్వారా కొండపైకి 3 వేల ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 1,200 మంది టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసు విభాగం నుంచి 3,800 మంది విధుల్లో ఉంటారన్నారు. గరుడ సేవకు దాదాపు 3.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తక్కువొస్తుందని బంగారం కొన్నాడు.. చివరికి ఊహించని ట్విస్ట్..
తక్కువొస్తుందని బంగారం కొన్నాడు.. చివరికి ఊహించని ట్విస్ట్..
కార్తీక మాసంలో ఈ రాశుల వారికి కార్యసిద్ధి.. అన్ని శుభాలే..!
కార్తీక మాసంలో ఈ రాశుల వారికి కార్యసిద్ధి.. అన్ని శుభాలే..!
అయ్యోపాపం.. కారు ఢీకొని పెద్దపులికి తీవ్రగాయాలు.. నొప్పి భరించలేక
అయ్యోపాపం.. కారు ఢీకొని పెద్దపులికి తీవ్రగాయాలు.. నొప్పి భరించలేక
అమరన్ సినిమాలో శివకార్తికేయన్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అమరన్ సినిమాలో శివకార్తికేయన్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
ట్రోఫీ తెచ్చినోడ్ని వద్దుపొమ్మంది.. కట్ చేస్తే.. తోపు తురుమ్ ఖాన్
ట్రోఫీ తెచ్చినోడ్ని వద్దుపొమ్మంది.. కట్ చేస్తే.. తోపు తురుమ్ ఖాన్
తిరుమల క్షేత్రంలో కొలువైన కొత్త పాలక మండలి..
తిరుమల క్షేత్రంలో కొలువైన కొత్త పాలక మండలి..
పిస్టల్‌తో బెదిరించి చోరీకి యత్నించిన దొంగకు పిచ్చెక్కించిన మహిళ
పిస్టల్‌తో బెదిరించి చోరీకి యత్నించిన దొంగకు పిచ్చెక్కించిన మహిళ
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 దొంగతనాలు.. చివరకు
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 దొంగతనాలు.. చివరకు
బాబోయ్.! పులితో పరాచకాలేంటి బాబాయ్.. చనువిస్తే యముడికి..
బాబోయ్.! పులితో పరాచకాలేంటి బాబాయ్.. చనువిస్తే యముడికి..
శుభ గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి అధికార యోగం..!
శుభ గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి అధికార యోగం..!