‘ధరల పెరుగుదల వాస్తవమే’నని పేర్కొంటూ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ వెల్లడించిన అధ్యయనంపై, తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరింత విస్తృతంగా అధ్యయనం చేసి, ఒక నివేదిక విడుదల చేసింది. రిజర్వుబ్యాంకుకు చెందిన ఎకానమిక్ అండ్ పాలసీ రీసెర్చి విభాగం టమాటో, ఉల్లి (ఆనియన్), ఆలు (పొటాటో) ధరలపైనే కేంద్రీకరించి ఈ అధ్యయనం చేసింది.