- Telugu News Photo Gallery Drinking ginger juice reduces menstrual cramps and joint pain, Check Here is Details
Ginger Juice: నెలసరి నొప్పులు, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్ బెస్ట్..
వంటిల్లే ఔషధ శాల అని ఊరికే అనలేదు పెద్దలు. మన వంట గదిలో ఉండే పదార్థాలతోనే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా మందికి వీటిని ఎలా వాడాలో తెలీక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన వంటింట్లో ఉండే ఔషధాల్లో అల్లం కూడా ఒకటి. ప్రతి రోజూ అల్లాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెగ్యులర్‌గా అల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలను..
Updated on: Oct 06, 2024 | 9:57 PM

వంటిల్లే ఔషధ శాల అని ఊరికే అనలేదు పెద్దలు. మన వంట గదిలో ఉండే పదార్థాలతోనే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా మందికి వీటిని ఎలా వాడాలో తెలీక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన వంటింట్లో ఉండే ఔషధాల్లో అల్లం కూడా ఒకటి.

ప్రతి రోజూ అల్లాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రెగ్యులర్‌గా అల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలను తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం రసం తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయిన టాక్సిన్స్ అన్నీ బయటకు పోతాయి. అలాగే గ్యాస్, అజీర్తి, అసిడిటీ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అల్లం రసంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాల వల్ల.. శరీరంలో మంట తగ్గుతుంది.

కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధ పడేవారు అల్లం రసం తాగితే వాటి నుంచి బయట పడొచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జలుబు, దగ్గు నుంచి రాకుండా ఉంటాయి.

అల్లం రసం తాగితే నెలసరిలో వచ్చే నొప్పిని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా వస్తాయి. హార్మోన్ల అసమతుల్యతను కూడా తగ్గిస్తుంది. బీపీని కూడా అదుపులో ఉంచుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




