AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day 2024: వాహనంపై త్రివర్ణ పతాకం ఎగరవేసే హక్కు అందరికి ఉందా..! ఈ తప్పులు చేస్తే 3 ఏళ్ల జైలు.. నిబంధనలు ఏమిటంటే

జాతీయ జెండా ఎగర వేయడంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వీటిని ఉల్లంఘిస్తే శిక్ష విధించే నిబంధన ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు తరచుగా తమ బైక్ లేదా కారుపై త్రివర్ణ పతాకాన్ని ఉంచుతారు. అయితే ఇలా ప్రతి ఒక్కరూ జెండా ఎగరవేయడానికి అనుమతిలేదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం తమ వాహనాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు నిర్దిష్ట వ్యక్తులకు మాత్రమే చట్టబద్ధమైన హక్కు ఉంది.

Independence Day 2024: వాహనంపై త్రివర్ణ పతాకం ఎగరవేసే హక్కు అందరికి ఉందా..! ఈ తప్పులు చేస్తే 3 ఏళ్ల జైలు.. నిబంధనలు ఏమిటంటే
Independence Day 2024
Surya Kala
|

Updated on: Aug 13, 2024 | 12:05 PM

Share

దేశం స్వాతంత్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతుంది. ఈ నేపధ్యంలో ఆగస్టు 15కి ముందు ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో త్రివర్ణ పతాకంతో తమ సెల్ఫీని ‘harghartiranga.com’లో అప్‌లోడ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే జాతీయ జెండా ఎగర వేయడంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వీటిని ఉల్లంఘిస్తే శిక్ష విధించే నిబంధన ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు తరచుగా తమ బైక్ లేదా కారుపై త్రివర్ణ పతాకాన్ని ఉంచుతారు. అయితే ఇలా ప్రతి ఒక్కరూ జెండా ఎగరవేయడానికి అనుమతిలేదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం తమ వాహనాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు నిర్దిష్ట వ్యక్తులకు మాత్రమే చట్టబద్ధమైన హక్కు ఉంది.

వాహనంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచే అధికారం ఎవరికి ఉంది?

త్రివర్ణ పతాకాన్ని ఎక్కడైనా ఎగురవేసేటప్పుడు జెండా పైభాగంలో కాషాయం రంగు ఉండాలని జాతీయ జెండా కోడ్ చెబుతోంది. అంతేకాదు చిరిగిన లేదా మురికిగా ఉన్న జెండాను ఎగరవేయకూడదు.

ఇప్పుడు జాతీయ జెండాను ఎవరి వాహనంపై ఎవరు ప్రదర్శించ వచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం.. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002లోని పేరా 3.44 ప్రకారం కార్లపై జాతీయ జెండాను ఎగురవేసే హక్కు క్రింది వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయబడింది..

ఇవి కూడా చదవండి
  1. దేశ అధ్యక్షుడు
  2. దేశ ఉపాధ్యక్షుడు
  3. గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్
  4. ఇండియన్ మిషన్ పోస్టుల అధిపతులు
  5. ప్రధాన మంత్రి
  6. కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర ఉప మంత్రులు
  7. ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రి
  8. భారత ప్రధాన న్యాయమూర్తి
  9. సుప్రీం కోర్టు న్యాయమూర్తి
  10. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి
  11. హైకోర్టుల న్యాయమూర్తులు

నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్ష ఏమిటంటే

పౌరులకు ఇంటి దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి లేదా తమ చేతుల్లో జెండా పట్టుకుని నడవడానికి స్వేచ్ఛ ఉంది. అయితే ప్రైవేట్ వాహనాలపై జెండాలు పెట్టడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఈ నేరానికి పాల్పడినట్లు తేలితే జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971 ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవచ్చు. దీని ప్రకారం జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం వంటి భారత జాతీయ చిహ్నాలను అవమానించిన వ్యక్తికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

జాతీయ జెండాను అవమానించినందుకు శిక్ష

ఇంట్లో జెండా ఎగరవేసే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి

నిబంధనల ప్రకారం ఏదైనా ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థ లేదా విద్యాసంస్థలోని సభ్యులెవరైనా ఏ రోజు, ఏ సందర్భంలోనైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే జాతీయ జెండాను ఎప్పుడు ప్రదర్శించినా దానికి పూర్తి గౌరవం ఇవ్వాలి. జాతీయ జెండాను సరైన స్థలంలో ఉంచాలి. అంటే జాతీయ జెండాను నేలపై లేదా మురికి ప్రదేశంలో ఉంచరు. అంతేకాదు చిరిగిన లేదా మురికిగా ఉన్న జెండాను ప్రదర్శించకూడదు.

రాత్రి సమయంలో జాతీయ జెండాను అవనతం చేయాలా?

ఇంతకుముందు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి ఉండేది. అయితే 2022 లో ప్రభుత్వం ఈ నిబంధనను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు జెండా ఎగురవేసేందుకు ఎలాంటి సమయ పరిమితి లేదు.

సవరించిన ఫ్లాగ్ కోడ్ ప్రకారం పాలిస్టర్ క్లాత్‌తో తయారు చేసిన జెండాను ఎగురవేయడంపై నిషేధం తొలగించబడింది. జాతీయ జెండాను పత్తి/పాలిస్టర్/ఉన్ని/ పట్టు/ఖాదీ బంటింగ్‌తో తయారు చేయవచ్చు. చేతితో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన జాతీయ జెండాలను కూడా ఉపయోగించవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..