Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రతం రోజున ఈ పరిహారాలు చేయండి .. ఆర్ధిక ఇబ్బందులు తీరి డబ్బు కొరత ఉండదు..

పంచాంగం ప్రకారం శ్రావణ శుక్రవారం ఆగస్టు 16వ తేదీ ఈ రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున సింహ రాశిలో పూజ సమయం ఉదయం 05:57 నుండి 08:14 వరకు ఉంటుంది. వృశ్చిక రాశిలో పూజ సమయం మధ్యాహ్నం 12:50 నుంచి 03:08 వరకు ఉంటుంది. కుంభ రాశిలో పూజ సమయం సాయంత్రం 06:55 నుంచి రాత్రి 08:22 వరకు.. వృషభ రాశిలో రాత్రి 11:22 నుంచి ఉదయం 01:18 వరకు పూజ సమయం ఉంటుంది.

Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రతం రోజున ఈ పరిహారాలు చేయండి .. ఆర్ధిక ఇబ్బందులు తీరి డబ్బు కొరత ఉండదు..
Varalakshmi Vratam
Follow us
Surya Kala

|

Updated on: Aug 13, 2024 | 9:52 AM

హిందూ మతంలో వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వర లక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి మందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ఆనందం, శాంతి ఉండాలంటూ ఉపవాసం పాటిస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మహిళలు తమ కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటూ చేసే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ చర్యలను అనుసరించండి. వీటిని చేయడం వలన ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు .. ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది.

వరలక్ష్మి ఉపవాస శుభ సమయం.. శుభ ముహూర్తం

పంచాంగం ప్రకారం శ్రావణ శుక్రవారం ఆగస్టు 16వ తేదీ ఈ రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున సింహ రాశిలో పూజ సమయం ఉదయం 05:57 నుండి 08:14 వరకు ఉంటుంది. వృశ్చిక రాశిలో పూజ సమయం మధ్యాహ్నం 12:50 నుంచి 03:08 వరకు ఉంటుంది. కుంభ రాశిలో పూజ సమయం సాయంత్రం 06:55 నుంచి రాత్రి 08:22 వరకు.. వృషభ రాశిలో రాత్రి 11:22 నుంచి ఉదయం 01:18 వరకు పూజ సమయం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వరలక్ష్మి వ్రతం కోసం పరిహారాలు ఏమిటంటే

ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీ దేవి పసుపు కొమ్ములను ఇష్టపడుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం స్నానం చేసి లక్ష్మీ దేవిని పూజించి, లక్ష్మీ దేవి పాదాల వద్ద 11 పసుపు కొమ్ములను సమర్పించండి. కొంత సమయం తరువాత గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి, వాటిని అల్మారాలో లేదా భద్రంగా ఉంచండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సంతోషం, ఐశ్వర్యం, సంపదలు పెరుగుతాయని నమ్ముతారు.

ఎవరైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించండి. ఈ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి. ఈ సమయంలో, జీవితంలో ఆనందం, శాంతి కోసం ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి.

అప్పుల బాధ నుంచి బయటపడేందుకు వరలక్ష్మీ వ్రతం రోజున తీసుకునే చర్యలు మేలు చేస్తాయి. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని నియమ నిష్టలతో పూజించండి. ఈ సమయంలో లక్ష్మీ దేవికి బియ్యం, బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా పూజించడం ద్వారా సాధకుడు రుణ విముక్తి పొందుతాడని నమ్ముతారు.

వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంతానం, ఐశ్వర్యం కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. వరలక్ష్మి ఉపవాసం ఉండాలంటే ఉదయాన్నే శుభ సమయంలో ఇంట్లో శ్రీ యంత్రాన్ని ప్రతిష్టించండి. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం శ్రీం నమః అనే మహాలక్ష్మీ మంత్రాన్ని జపించండి. ఈ ఉపవాసం రోజున మహిళలు పసుపు, కుంకుమాన్ని ఉపయోగించి ముగ్గులు, స్వస్తిక్ గుర్తును వేస్తారు. దీనితో పాటు వరలక్ష్మీ వ్రతం రోజున ఏడుగురు ఆడపిల్లలను ఇంటికి పిలిచి బియ్యం పాయసాన్ని పెట్టే సంప్రదాయం కూడా ఉంది. దీంతో ఆ ఇంట్లో ప్రజల కోరికలన్నీ నెరవేరి సుఖ సంతోషాలు నెలకొంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు