పార తగిలి శివలింగం నుంచి రక్త ప్రవాహం.. 300 ఏళ్లుగా పూజ అందుకుంటున్న చిద్రమైన లింగం ఎక్కడంటే..
ఛిన్నా భిన్నమైన రూపంలో శివయ్య గత మూడు వందల సంవత్సరాలుగా తన భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ శివలింగాన్ని గాయపడిన మహాదేవుడు లేదా వృద్ధ మహాదేవుడి పేరుతో పూజిస్తారు. 17వ శతాబ్దం నుండి ఘాజీపూర్‌లోని మొఘల్‌పురాలో ఉన్న ఘయల్ మహాదేవుడి ఆలయం గురించి.. ఆలయ చరిత్ర గురించి ఈ రోజు తెలుసుకుందాం..
హిందూ మత గ్రంధాలలో విరిగిన విగ్రహాలను లేదా చిత్ర పటాలను పూజించడం నిషేధం. అయితే ఓ ప్రాంతంలో మాత్రం ఈ నిబంధన వర్తించదు. అక్కడ ఉన్న విరిడిన శివుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పుజిస్తారు. అది కూడా కొన్ని వందల ఏళ్లుగా అక్కడ పూజలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సుమారు 300 సంవత్సరాలుగా విరిగిన శివలింగాన్ని పూజిస్తున్నారు. ఛిన్నా భిన్నమైన రూపంలో శివయ్య గత మూడు వందల సంవత్సరాలుగా తన భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ శివలింగాన్ని గాయపడిన మహాదేవుడు లేదా వృద్ధ మహాదేవుడి పేరుతో పూజిస్తారు. 17వ శతాబ్దం నుండి ఘాజీపూర్‌లోని మొఘల్‌పురాలో ఉన్న ఘయల్ మహాదేవుడి ఆలయం గురించి.. ఆలయ చరిత్ర గురించి ఈ రోజు తెలుసుకుందాం..
ఈ శివాలయం ఘాజీపూర్ నగరంలోని సదర్ కొత్వాలి ప్రాంతంలోని మొఘల్‌పురా ప్రాంతంలో గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగం కొంత భాగం కట్ అయింది. స్థానిక ప్రజల ఈ విషయం గురించి మాట్లాడుతూ 17వ శతాబ్దంలో మొఘలల పాలన సాగుతున్నప్పుడు.. ఇక్కడ ఈ స్థలంలో వ్యవసాయం చేసేవారు. ఒకరోజు పొలంలో వ్యవసాయం చేస్తున్న ఓ రైతు పారతో భూమిని తవ్వుతున్నాడు. అప్పుడు భూమిలోపల ఏదో ఒక గట్టి వస్తువుకు పార తగిలింది. ఒక్కసారిగా అక్కడ పెద్ద శబ్ధం రావడంతో పాటు.. ఆ ప్రదేశమంతా రక్తపు ధార ప్రవహించింది. సంఘటనా స్థలంలో రైతుతో పాటు ఉన్న వ్యక్తులు మట్టిని తొలగించగా.. లోపల శివలింగంఉంది. అంతేకాదు శివలింగానికి పార తాకిన శివలింగం భాగం నుంచి రక్తం కారుతోంది.
రైతు కలలో శివయ్య
అలా శివ లింగం నుంచి రక్తం రావడం చూసి జనాలకు భయం మొదలైంది. అంతేకాదు రైతు కూడా తనకు ఏదైనా చెడు జరుగుతుందేమో అంటూ భయపడటం ప్రారంభించాడు. అదే రోజు రాత్రి రైతు కలలో శివయ్య కనిపించి ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించమని కోరాడట. మరుసటి రోజు రైతు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అందరూ కలిసి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఇక్కడ ఘయాల్ మహాదేవుడి పేరుతో శివయ్య పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో శ్రావణ మాసం సమయంలో శివయ్యకు ప్రత్యేక అలంకారాలు చేస్తాడు. ప్రత్యేకించి ఈ మాసంలో భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి బాబా దర్శనం చేసుకొని జలాభిషేకం చేసి పుణ్యఫలం పొందుతారు. ఎవరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ప్రజలు ముందుగా ఈ ఆలయానికి వచ్చి భోలాశంకరుడిని పూజిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు