Iran-Israel tensions: మిడిల్‌ ఈస్ట్‌లో యుద్దవాతావరణం.. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేసే అవకాశం

పశ్చిమాసియాలో యుద్దమేఘాలు మరోసారి కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై నలు దిక్కుల నుంచి దాడి చేసేందుకు రంగం సిద్దమయ్యింది. ఇరాన్‌ నేతృత్వంలో దాడులకు స్కెచ్‌ గీశారు. ఇరాన్‌తో పాటు లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూప్‌ , పాలస్తీనాకు చెందిన హమాస్‌ , యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై దాడికి రెడీ అయ్యాయి. ఇజ్రాయెల్‌పై ఈ రాత్రికి ఇరాన్‌ దాడి చేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Iran-Israel tensions: మిడిల్‌ ఈస్ట్‌లో యుద్దవాతావరణం.. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేసే అవకాశం
Iran Israel Tensions
Follow us

|

Updated on: Aug 13, 2024 | 7:49 AM

మిడిల్‌ ఈస్ట్‌లో యుద్దవాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్‌ దాడి చేసే అవకాశముందని అమెరికా హెచ్చరించింది. ఇరాన్‌తో పాటు హిజ్బుల్లా , హమాస్‌ , హౌతీ గ్రూపులు కూడా ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడే అవకాశాలున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా నేవీ రంగం లోకి దిగింది.  గత ఏడాది హామాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై అకస్మాత్తుగా దాడి చేసి మరణం హోమం సృష్టించారు. కొంతమందిని బందీలుగా తీసుకుని వెళ్ళారు. తమపై దాడి చేసినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేయడం మొదలు పెట్టింది. హామాస్ ను నాశనం చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది.

పశ్చిమాసియాలో యుద్దమేఘాలు మరోసారి కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌పై నలు దిక్కుల నుంచి దాడి చేసేందుకు రంగం సిద్దమయ్యింది. ఇరాన్‌ నేతృత్వంలో దాడులకు స్కెచ్‌ గీశారు. ఇరాన్‌తో పాటు లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూప్‌ , పాలస్తీనాకు చెందిన హమాస్‌ , యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై దాడికి రెడీ అయ్యాయి. ఇజ్రాయెల్‌పై ఈ రాత్రికి ఇరాన్‌ దాడి చేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ లుఫ్తాన్సా మిడిల్‌ఈస్ట్‌కు విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ , ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ , లెబనాన్‌ రాజధాని బీరూట్‌ , జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌తో పాటు ఇరాక్‌ లోని ఇర్బిల్‌ ఎయిర్‌పోర్ట్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్‌కు మరోసారి అమెరికా అండగా నిలిచింది.

అధునాతన సబ్‌ మెరైన్లతో పాటు యుద్ద నౌకలను అమెరికా నేవీ మిడిల్‌ ఈస్ట్‌కు పంపించింది. గైడెడ్‌ మిస్సైల్‌ సబ్‌ మెరైన్‌ USS జార్జియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అంతేకాకుండా భారీ యుద్ద నౌక అబ్రహం లింకన్‌కు కూడా పంపించారు. 90 యుద్ద విమానాలను ఒకేసారి తీసుకెళ్లే సామర్ధ్యం ఈ నౌకకు ఉంది. ఇరాన్‌ కవ్వింపు చర్యలను ఆపాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కోరారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. తాజా పరిణామాలతో గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా విఘాతం ఏర్పడే అవకాశం ఉంది. గాజాలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. లెబనాన్‌ నుంచి వేలాదిమంది విదేశాలకు యుద్దభయంతో వెళ్లిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..