AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mexico: మెక్సికోలో అరుదైన ఘటన.. వినాశనానికి సంకేతమంటున్న పురాతన తెగ

మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతనమైన ఒక పిరమిడ్‌ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెనువిపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలిన పిరమిడ్లకు

Mexico: మెక్సికోలో అరుదైన ఘటన.. వినాశనానికి సంకేతమంటున్న పురాతన తెగ
Pyramid
Ravi Kiran
|

Updated on: Aug 12, 2024 | 6:00 PM

Share

మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతనమైన ఒక పిరమిడ్‌ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెనువిపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు ఉండటాన్ని ఈ ఫొటోలలో కనిపిస్తోంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పురాతన పురేపెచా తెగ వారు తమ దేవతకు మానవ బలులు అర్పించడానికి యకాటా పిరమిడ్‌ను ఉపయోగించేవారని తెలుస్తోంది. యకాటా పిరమిడ్‌లు మిచోకాన్ రాష్ట్రంలోని ఇహుట్జోలో ఉన్నాయి.

ఇప్పడు వచ్చిన తుఫాను పెను విధ్వంసాన్ని సూచిస్తుందని స్థానికుడు తరియాక్విరి అల్వారెజ్ మీడియా ముందు పేర్కొన్నారు. ఇది మా పూర్వీకులకు సంబంధించిన చేదువార్త. ఇది విపత్కర సంఘటనను సూచిస్తోందని ఆయన అన్నారు. 1519లో స్పానిష్ దండయాత్రకు ముందు పురేపెచా తెగలు అజ్టెక్‌లను ఓడించి 400 సంవత్సరాలు పాలించాయి. ఇహుట్జోలో ఒక పిరమిడ్ కూలిపోయింది. భారీ వర్షాల కారణంగా ఇది జరిగింది. ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల ​కారణంగా పలుప్రాంతాల్లో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయని మెక్సికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ ఓ ప్రకటనలో తెలిపింది. పిరమిడ్ బయటి గోడ, లోపలి భాగం దెబ్బతిన్నట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి మరమ్మతు చేయడంపై అధికారులు దృష్టి సారించారని తెలిపింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రేపు స్కూల్స్‌కు సెలవు.. ప్రభుత్వం నుంచి ప్రకటన
రేపు స్కూల్స్‌కు సెలవు.. ప్రభుత్వం నుంచి ప్రకటన
భారతదేశం ఏయే దేశాల నుండి ఎంత బంగారాన్ని కొనుగోలు చేస్తుందో తెలుసా
భారతదేశం ఏయే దేశాల నుండి ఎంత బంగారాన్ని కొనుగోలు చేస్తుందో తెలుసా
వారికి హోమ్ లోన్‌ కష్టమేమీ కాదు.. ఇలా చేస్తే సింపుల్‌గా అకౌంట్‌లో
వారికి హోమ్ లోన్‌ కష్టమేమీ కాదు.. ఇలా చేస్తే సింపుల్‌గా అకౌంట్‌లో
పర్యాటకుల స్వర్గధామం.. 'కాకుల ద్వీపం'..! మనదేశంలోనే ఎక్కడ ఉందంటే.
పర్యాటకుల స్వర్గధామం.. 'కాకుల ద్వీపం'..! మనదేశంలోనే ఎక్కడ ఉందంటే.
నవ పంచమి రాజయోగం.. ఆ రాశుల వారికీ ఊహించని డబ్బు
నవ పంచమి రాజయోగం.. ఆ రాశుల వారికీ ఊహించని డబ్బు
రెండు పీపీఎఫ్ అకౌంట్లు ఉంటే నష్టపోతారా..?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు ఉంటే నష్టపోతారా..?
చిరుతపులి షాకింగ్ వేట.. స్పృహ కోల్పోయినట్లు నటించి, ప్రజలపై దాడి!
చిరుతపులి షాకింగ్ వేట.. స్పృహ కోల్పోయినట్లు నటించి, ప్రజలపై దాడి!
ఇండియా-పాక్ మ్యాచ్ రద్దయితే ఆ మూడు జట్లు టోర్నీ నుంచి అవుట్
ఇండియా-పాక్ మ్యాచ్ రద్దయితే ఆ మూడు జట్లు టోర్నీ నుంచి అవుట్
రూ.45 కోట్లు పెట్టి చెత్త సినిమా తీశారు.. హీరోయిన్ ఆవేదన..
రూ.45 కోట్లు పెట్టి చెత్త సినిమా తీశారు.. హీరోయిన్ ఆవేదన..
పీఎం కిసాన్ విడుదలపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
పీఎం కిసాన్ విడుదలపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?