ఆలయ ఈవోపై వేటు.. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న భక్తులు, సిబ్బంది..!

సత్య ప్రమాణాలకు క్షేత్రం కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయ ఈవో పై వేటు వ్యవహారం ఇప్పుడు చర్చ గా మారింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సంబరాలు జరుపుకునేందుకు కారణమైంది.

ఆలయ ఈవోపై వేటు.. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్న భక్తులు, సిబ్బంది..!
Eo Venkateshu
Follow us
Raju M P R

| Edited By: Balaraju Goud

Updated on: Aug 13, 2024 | 7:36 AM

సత్య ప్రమాణాలకు క్షేత్రం కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయ ఈవో పై వేటు వ్యవహారం ఇప్పుడు చర్చ గా మారింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సంబరాలు జరుపుకునేందుకు కారణమైంది. 4 ఏళ్లుగా ఆలయ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశుపై చర్యలతో స్థానికులు, ఉభయదారులు, ఒప్పంద ఉద్యోగులు, అర్చకులు ఇలా అందరూ బాణా సంచా కాల్చి మరీ సంబరాలు జరుపుకునేలా చేసింది.

ఆలయ ఈవోగా పలు వివాదాలు, దాతలు ఉభయ దారులతో గొడవలు, అర్చకులు ఒప్పంద ఉద్యోగులపట్ల కక్ష సాధింపుగా వ్యవహరించడం ఈవో వెంకటేశు తీరుగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈవో వ్యవహారం వివాదాస్పదంగా కూడా మారింది. ఈవో ఏకపక్ష నిర్ణయాలను గత కొంత కాలంగా వ్యతిరేకిస్తున్న ఉభయ దారులు విజ్ఞాలకు అధిపతి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్ల విషయంలో అమీ తుమీ తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. కాణిపాకంలో జరిగిన ఉభయదారుల సమావేశంలో ఈవో నిర్ణయాలను తప్పుపట్టిన ఉభయ దారుల సమావేశం గొడవలతో ముగిసింది.

దూషణలు, సవాళ్లు ఆరోపణలతో సమావేశం సాగింది. సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను కాణిపాకం దేవస్థానం నిర్వహించనుండగా ఏర్పాట్లపై ఉభయ దారులు సమావేశమయ్యారు. ఆలయ ఈవో వెంకటేష్ ఏకపక్ష నిర్ణయాలను ఉభయదారులు తప్పు పట్టారు. ఉభయ దారుల ప్రాధాన్యతను తగ్గిస్తున్న ఈవోపై వాగ్వాదానికి దిగారు. తోపులాట దాకా వెళ్ళిన ఉభయ దారుల సమావేశం వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది.

ఈవో, ఉభయ దారుల మధ్య జరిగిన గొడవ పోలీసులు జోక్యం చేసుకునే దాకా వెళ్ళింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్ కోఆర్డినేషన్ సమావేశంలోనే తేల్చుకునేందుకు ఉభయదారులు సిద్ధం కావడంతో ఈఓ వైఖరి మరింత వివాదాస్పదంగా మారింది. దీంతో కాణిపాకం దేవస్థానం ఈవో గా ఉన్న వెంకటేశు పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం ఈవో వెంకటేశు ను జీఏడీలో రిపోర్ట్ చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో ఒక్కసారిగా కాణిపాకంలో సంబరాలు జరిగాయి. ఆలయ ఈవో కార్యాలయం ముందు సంబరాలు జరుపుకున్న స్థానికులు ఈఓ వెంకటేష్ పై వేటుతో కాణిపాకం కు పట్టిన గ్రహణం వీడిందంటూ సంబరాలు జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, ఉభయదారులు, తాత్కాలిక ఉద్యోగులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..