Dog Khali: ఈ కుక్క శివయ్య భక్తుడు.. డ్యుటీకి ముందు శివయ్యకు నమస్కారం, శ్రావణ సోమవారంలో ఉపవాసం..

ఉజ్జయినిలో బాబా మహాకాళేశ్వరుని భక్తుడు ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ప్రతిరోజూ ఆలయంలో తన డ్యూటీ చేసే ముందు మహాకాళేశ్వరునికి శిరస్సు వంచి నమస్కరిస్తాడు. ఆ తర్వాత తన పనిని ప్రారంభిస్తాడు. అంతేకాదు ఈ భక్తుడు శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భక్తుడు మనిషి కాదు కుక్క. ఈ కుక్క పేరు ఖలీ.

Dog Khali: ఈ కుక్క శివయ్య భక్తుడు.. డ్యుటీకి ముందు శివయ్యకు నమస్కారం, శ్రావణ సోమవారంలో ఉపవాసం..
Ujjain Dog Khali
Follow us

|

Updated on: Aug 13, 2024 | 9:26 AM

హిందూ మతంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ పన్నెండు ప్రసిద్ధ జ్యోతిర్లింగాలలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వరాలయం ఒకటి. ఇక్కడ కొలువైన మహాకాళుని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఉజ్జయినిలో బాబా మహాకాళేశ్వరుని భక్తుడు ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ప్రతిరోజూ ఆలయంలో తన డ్యూటీ చేసే ముందు మహాకాళేశ్వరునికి శిరస్సు వంచి నమస్కరిస్తాడు. ఆ తర్వాత తన పనిని ప్రారంభిస్తాడు. అంతేకాదు ఈ భక్తుడు శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భక్తుడు మనిషి కాదు కుక్క. ఈ కుక్క పేరు ఖలీ.

కొన్నేళ్ల క్రితం షాజాపూర్ నుంచి ఉజ్జయినికి కుక్క ఖలీని తీసుకొచ్చారు. మహాకాళేశ్వరుని ఆలయ భద్రత కోసం ఖలీని నియమించారు. ఈ ఖలీ మహాకాళేశ్వరుని ఆలయంతో పాటు ఇతర ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లను చూసే డాగ్ స్క్వాడ్ బృందంలో సభ్యుడు కూడా. ప్రతిరోజూ మహాకాళేశ్వర ఆలయానికి తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు వచ్చే ఈ కుక్క ఖలీ మహాకాళునికి అమితమైన భక్తుడని, ఆలయానికి చేరుకోగానే ముందుగా మహాకాళేశ్వరునికి నమస్కరిస్తాడని ఆలయానికి సంబంధించిన వ్యక్తులు చెబుతారు. ఆ తర్వాతనే తన కర్తవ్యాన్ని ప్రారంభిస్తుంది. ఈసారి ఖలీ శ్రావణ సోమవారం రోజున ఉపవాసం ఉంది. అయితే ఖలీ ప్రతి సోమవారం పాలు మాత్రమే తాగుతుంది. ఇతర రోజుల్లో ఈ ఖలీ ఆహారం భిన్నంగా ఉంటుంది.

భద్రత బాధ్యత ఖలీపై ఉంది

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 2024లో షాజాపూర్ నుండి ఉజ్జయినికి వచ్చిన కుక్క ఖలీ అన్ని రకాల భద్రతలను బాధ్యతగా నిర్వవహిస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఏ కార్యక్రమం నిర్వహించినా లేదా ఏ పెద్ద నాయకుడి రాకతో అయినా సరే జర్మన్ షెపర్డ్ కుక్క ఖలీ ప్రతి భద్రతా పనిని చాలా చక్కగా నిర్వహిస్తుంది. రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉజ్జయిని చేరుకున్నప్పుడు కూడా వారి భద్రత కోసం ఈ కుక్క ఖలీని మోహరించారు. ఈ జర్మన్ షెపర్డ్ కుక్క ఖలీ వయస్సు కేవలం 4 సంవత్సరాలు.. దీని హ్యాండ్లర్ వినోద్ మీనా.

పోలీసు బృందంలో ఈ కుక్క కూడా ఒకటి

సబ్ ఇన్‌స్పెక్టర్ మహేష్ శర్మ, కానిస్టేబుల్ అనిల్, హెడ్ కానిస్టేబుల్ విక్రమ్ సింగ్ ప్రతిరోజు వారితో సన్నిహితంగా పనిచేసే కానిస్టేబుళ్లు రాహుల్, మహేంద్రల బృందంలో డాగ్ ఖలీ కూడా ఉంది.

ఉజ్జయిని మహాకాళేశ్వరుని టెంపుల్ చెకింగ్ టీమ్‌లో డాగ్ ఖలీని చేర్చినట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ మహేష్ శర్మ తెలిపారు. ఇప్పుడు శ్రావణ సోమవారం వంటి ప్రత్యేక రోజులలో కూడా ఖలి ఉపవాసం ఉంటుంది. ఖలీకి రోజువారీ ఆహారంలో పాలు, బ్రెడ్ ఇచ్చినప్పటికీ.. సోమవారం దీని ఆహారంలో ఖచ్చితంగా కొంత మార్పు ఉంటుంది. ఈ రోజున అది కేక్ లేదా మరేదైనా ఆహారం తినదు. కేవలం పాలు మాత్రమే తాగుతుంది. భక్తులు సోమవారం పండ్లు, పాలు తిని ఎలా ఉపవాసం ఉంటారో.. ఖలీ కూడా సోమవారం పాలు మాత్రమే తాగి ఉపవాశం ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ