Explainer: మన దేశంలో డ్యాముల సేఫ్టీ ఎంత ??
తుంగభద్ర డ్యామ్ గేటు గల్లంతు. ఈ వార్త విన్నవారి గుండె గుభేల్ మంటుంది. డ్యామ్ గేటు కొట్టుకుపోవడం అంటే మాటలు కాదు. అందులోనూ 1953లో నిర్మాణమైనా.. దాదాపు 70 ఏళ్లుగా ప్రాజెక్ట్ గేట్ల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఇప్పుడు ఒక్కసారిగా 19వ నెంబర్ గేటు గల్లంతైంది. దీనికి కారణం నిర్వహణ లోపమా? మరేదైనా కారణం ఉందా? ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నీళ్లే.. కర్ణాటకతో పాటు ఏపీలోని రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు దిక్కు.
తుంగభద్ర డ్యామ్ గేటు గల్లంతు. ఈ వార్త విన్నవారి గుండె గుభేల్ మంటుంది. డ్యామ్ గేటు కొట్టుకుపోవడం అంటే మాటలు కాదు. అందులోనూ 1953లో నిర్మాణమైనా.. దాదాపు 70 ఏళ్లుగా ప్రాజెక్ట్ గేట్ల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఇప్పుడు ఒక్కసారిగా 19వ నెంబర్ గేటు గల్లంతైంది. దీనికి కారణం నిర్వహణ లోపమా? మరేదైనా కారణం ఉందా? ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నీళ్లే.. కర్ణాటకతో పాటు ఏపీలోని రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు దిక్కు. ఇప్పుడీ గేటు సమస్య వల్ల.. నీరు వృథాగా కిందకు పోతుండడంతో.. సాగుతో పాటు.. కొన్ని వందల గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పవు. తుంగభద్ర డ్యామ్ కు ఉన్న మొత్తం గేట్లు.. 33. ఈ గేట్లను శనివారం రాత్రి ఎత్తి.. దిగువకు నీటిని వదులుతున్నప్పుడు.. 19వ నెంబర్ గేటుకున్న చైన్ లింక్ తెగింది. దీంతో అది డ్యామ్ ముందు నీళ్లలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు ఉన్న సమస్య ఏంటంటే.. దీనికి స్టాప్ లాగ్ గేట్స్ లేవు. అంటే.. మెయిన్ గేట్లకు ఏమైనా అయితే.. అప్పుడు నీరు కిందకు పోకుండా.. ఈ స్టాప్ లాక్ గేట్స్ ను ఉపయోగిస్తారు. ఇప్పుడవి లేకపోవడంతో వేలాది క్యూసెక్కులను కిందకు వదలక తప్పలేదు. దీంతో స్టాప్ లాగ్ గేట్ ను వీలైనంత త్వరగా అమర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఈ డ్యామ్ ఉండేది కర్ణాటకలోనే. అయితే తెలంగాణ, ఏపీ, కర్ణాటక అధికారులు పనిచేసే తుంగభద్ర బోర్డు ఆధీనంలో ఈ డ్యామ్ నిర్వహణ ఉంటుంది. ఇక తుంగభద్ర డ్యామ్ కు అప్పట్లో గేట్లను ఆపరేట్ చేయడానికి చెయిన్ విధానాన్ని ఏర్పాటు చేశారు. కొత్తవాటిలో అయితే రేడియల్ గేట్లు అమర్చుతున్నా.. పాతవాటిలో ఈ సదుపాయం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగచైతన్య ఎఫెక్ట్.. దెబ్బకు దిగివచ్చిన వేణు స్వామి.. | వేణు స్వామిపై కేస్ పెడతాం
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

