AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana: మీరు కొనే అరటి పండ్లు.. రసాయనాలతో పండించారో లేదో చిటికెలో చెప్పే ట్రిక్‌ ఇదే!

అరటి పండ్లు రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో కొందరు వ్యాపారులు లాభాల కోసం రసాయనాలతో పండించిన అరటిపండ్లు అమ్ముతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి మార్కెట్లో కొనుగోలు చేసతే అరటిపండ్లు ఏవి రసాయనాలతో..

Banana: మీరు కొనే అరటి పండ్లు.. రసాయనాలతో పండించారో లేదో చిటికెలో చెప్పే ట్రిక్‌ ఇదే!
How To Identify Chemical Ripe Bananas
Srilakshmi C
|

Updated on: Jan 05, 2026 | 6:20 PM

Share

పిల్లల నుంచి పెద్దల వరకు అరటిపండ్లు ఇష్టం తింటారు. ఇవి రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో కొందరు వ్యాపారులు లాభాల కోసం రసాయనాలతో పండించిన అరటిపండ్లు అమ్ముతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కాబట్టి మార్కెట్లో కొనుగోలు చేసతే అరటిపండ్లు ఏవి రసాయనాలతో పండించాలరో? ఏవి సహజంగా పండినవో ఈ చిన్న ట్రిక్‌తో తెలుసుకుందాం..

కాండం రంగు

రసాయనికంగా పండించిన అరటిపండు కాండం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కానీ అరటిపండు మాత్రం పూర్తిగా పసుపు రంగులో కనిపిస్తుంది. అయితే, సహజంగా పండిన అరటిపండు కాండం, అరటి పండు రెండూ క్రమంగా పసుపు లేదా నల్ల రుంగులోకి మారుతాయి.

తొక్క రంగు

రసాయనికంగా పండించిన అరటిపండ్లు నిమ్మకాయ లాంటి పసుపు రంగులో ప్రకాశవంతంగా, చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే సహజంగా పండిన అరటిపండ్లు లేత పసుపు రంగులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నల్ల మచ్చలు

అరటిపండ్లు సహజంగా పండినప్పుడు వాటిలో సహజమైన నల్ల మచ్చలు ఏర్పడతాయి. రసాయనికంగా పండిన అరటిపండ్లలో అలాంటి మచ్చలు ఉండవు. అవి పూర్తిగా శుభ్రంగా, నిండు పసుపు రంగులో కనిపిస్తాయి.

అరటిపండు రుచి

రసాయనికంగా పండించిన అరటిపండ్లు తక్కువ తీపి రుచిని కలిగి ఉంటాయి. కొన్నిసార్లు కొద్దిగా ఆస్ట్రిజెంట్ లేదా చేదు రుచిని కూడా కలిగి ఉంటాయి. సహజ అరటిపండ్లు చాలా తీపిగా, జ్యుసిగా రుచిగా ఉంటాయి.

నీటి పరీక్ష

ఒక బకెట్ నీటిని తీసుకొని అందులో అరటిపండ్లు వేయండి. అరటిపండ్లు నీటిపై తేలుతూ ఉంటే అవి సహజంగా పండినవి. అరటిపండ్లు నీటి అడుగున మునిగిపోతే, అవి రసాయనికంగా పండినవిగా అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే రసాయనాలు అరటిపండ్ల బరువును పెంచుతాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పడుకునే ముందు యూట్యూబ్‌ చేసే అలవాటు ఉందా?
పడుకునే ముందు యూట్యూబ్‌ చేసే అలవాటు ఉందా?
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి
మహిళలు ఇది మీకే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే ఈ పనులు చేయకండి
ఒక్క తప్పిదం.. 8ఏళ్ల శిక్ష.. డోపింగ్ ఉచ్చులో ఇద్దరు భారత ఆటగాళ్లు
ఒక్క తప్పిదం.. 8ఏళ్ల శిక్ష.. డోపింగ్ ఉచ్చులో ఇద్దరు భారత ఆటగాళ్లు
అంబానీయా మజాకా.! రూ. 91కే 28 రోజుల గోల్డెన్ ఆఫర్..
అంబానీయా మజాకా.! రూ. 91కే 28 రోజుల గోల్డెన్ ఆఫర్..
ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా? అందాల తారల రహస్యం ఇదేనట!
ఆయిల్‌ పుల్లింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా? అందాల తారల రహస్యం ఇదేనట!
రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆ ఒక్క పని చేసుంటే బ్రతికేవాడు..
రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆ ఒక్క పని చేసుంటే బ్రతికేవాడు..
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ విషయాలు కనిపిస్తున్నాయా..? అలర్ట్
క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఈ విషయాలు కనిపిస్తున్నాయా..? అలర్ట్
ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?
ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?