Haleem ke kebab: రంజాన్ స్పెషల్ రెసిపీ హలీమ్ కె కబాబ్.. రుచి అదిరిపోతుందంతే!
ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా, నియమ నిష్టలతో జరుపుకునే పండుగల్లో రంజాన్ కూడా ఒకటి. రంజాన్ మాసం రేపటితో ముగుస్తుంది. ఏప్రిల్ 11వ తేదీ గురువారం రంజాన్‌ని జరుపుకుంటారు. రంజాన్ మాసం చివరి రోజున ముఖ్యమైన పండుగ.. ఈద్-ఉల్-ఫితర్ నిర్వహించుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధంగా ఉన్నారు. రంజాన్ పండుగ రోజు ఎన్నో స్పెషల్ వంటకాలు తయారు చేస్తారు. వాటిల్లో హలీమ్ కె కబాబ్ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీని..

ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా, నియమ నిష్టలతో జరుపుకునే పండుగల్లో రంజాన్ కూడా ఒకటి. రంజాన్ మాసం రేపటితో ముగుస్తుంది. ఏప్రిల్ 11వ తేదీ గురువారం రంజాన్‌ని జరుపుకుంటారు. రంజాన్ మాసం చివరి రోజున ముఖ్యమైన పండుగ.. ఈద్-ఉల్-ఫితర్ నిర్వహించుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధంగా ఉన్నారు. రంజాన్ పండుగ రోజు ఎన్నో స్పెషల్ వంటకాలు తయారు చేస్తారు. వాటిల్లో హలీమ్ కె కబాబ్ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హలీమ్ కె కబాబ్‌కి కావాల్సిన పదార్థాలు:
బర్గుల్, మినపప్పు, మటర్ దాల్, పెసర పప్పు, మటన్ చాప్స్, కారం, పసుపు, ఉప్పు, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కుంకుమ పువ్వు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, శనగ పిండి, పచ్చి మర్చి, కొత్తి మీర, పుదీనా, నెయ్యి లేదా నూనె.
హలీమ్ కె కబాబ్ తయారీ విధానం:
ముందుగా మనట్ చాప్స్‌ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ చాప్స్‌కు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను బాగా పట్టించి, మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో అన్ని రకాల పప్పులు, మటన్ వేసి.. బాగా ఉడికించాలి. కనీసం ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి మొత్తం పోయాక.. కుక్కర్ మూత తీసి.. మటన్ చాప్స్ ముక్కలను తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మటన్ ఎముకల నుంచి మెత్తటి మాంసాన్ని తీసి.. వేరు చేయాలి. ఆ మాంసాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తి మీర, పుదీనా, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చి మిర్చి, కుంకుమ పువ్వు వేసి వేయించాలి. ఇప్పుడు చాట్ మసాలా పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా ఉడికించుకున్న పప్పు మిశ్రమం, మటన్ పేస్టును వేసి కలపాలి. ఓ పది నిమిషాల పాటు ఉడికించి.. శనగపిండి కలిపి చల్లారేంత వరకూ పక్కన పెట్టాలి. ఇప్పుడు చేతి నెయ్యి రాసుకుని చిన్న చిన్న టిక్కాల్లా ఒత్తుకోవాలి. వీటిని పెనం మీద పెట్టి కాల్చుకోవాలి. అంతే ఎంతో టేస్టీ హలీమ్ కె కబాబ్స్ సిద్ధం.








