Rat Repellent: ఎలుకలపై బ్రహ్మాస్త్రం.. ఇలా చేస్తే ఇంట్లో ఒక్కటి కూడా ఉండదు.. దెబ్బకు పారిపోవాల్సిందే!
ఎలుకలు.. ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నా.. అవి విలువైన వస్తువులను నాశనం చేస్తాయి, ఆహారాన్ని కలుషితం చేస్తాయి. కాబట్టి వీటిని ఇంట్లో రానివ్వకుండా అరికట్టడం చాలా ముఖ్యం. కాబట్టి ఒక సులభమైన చిట్కాలతో వీటిని మీరు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టొచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. ఇంతకు ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ఎలుకలు ఇవి చూడ్డానికి ఇంత ఉంటాయి కానీ.. ఇంటి పీకి పందిరి వేస్తాయి. ఈ ఎలుకల సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇవి ఇంటి మూళల్లో ,సందుల్లో దాక్కున్న విలువైన పత్రాలను, బట్లలను నాశనం చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు తినే ఆహార పదార్థాలపై తిరుగుతూ వాటిని కలుషితం చేస్తాయి. ఆ ఆహారాన్ని తినడం వల్ల జనాలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వీటిని వదిలించుకోవడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే ర్యాట్ ప్యాడ్స్ ఉపయోగిస్తారు. కానీ అవి వాటిని ఇంట్లో నుంచి శాశ్వతంగా తరిమికొట్టలేవు. అందుకే మన ఇంట్లో ఉండే కర్పూరంతో ఈజీగా ఎలుకలను తరిమికొట్టే టిప్ గురించి మీరు తెలుసుకోవాలి. అవును మీరు ఇళ్లు క్లీన్ చేసే నీటిలో కర్పూరం వేసి క్లీన్ చేయడం ద్వారా ఆ ఘటైన వాసనకు అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇది ఒక్క ఎలుకలనే కాదు బల్లులు, ఇతర కీటకాలను సైతం ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుంది
ఎలుకలను తరిమికొట్టడానికి కర్పూరం ఎలా సహాయపడుతుంది?
ఎలుకలను తరిమికొట్టేందుకు కర్పూరం అనేది ఒక చౌకైన. ప్రభావవంతమైన పదార్థం. కర్పూరం చాలా బలమైన, ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. ఈ వాసన ఎలుకలకు అస్సలు పడదు. ఈ వాసనను అవి తట్టుకోలేవు. దీంతో వెంటనే ఆ ప్రాంతం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. ఇది ఎలుకలను దూరంగా ఉంచడానికి సహజమైన పరిష్కారం మాత్రమే కాదు, సురక్షితమైన పరిష్కారం కూడా.
ఎలుకలను తరిమికొట్టడానికి కర్పూరం ఎలా ఉపయోగించాలి?
మీరు ఇళ్లు క్లీన్ చేసేందుకు బకెట్‌లో నీటిని తీసుకున్నుడు అందులో 4-5 కర్పూరం ముక్కలను వేసి, ఈ నీటితో ఇంటి మొత్తాన్ని తుడుచుకోండి. కర్పూరం తక్కువగా ఉంటే, మీరు దానికి కొంచెం పిప్పరమెంటు నూనెను కూడా యాడ్ చేయవచ్చు. ఈ నీటితో మీ ఇంట్లో ఎలుకలు, బల్లులు ఎక్కువగా తిరగే ప్రదేవాల్లో శుభ్రం చేయండి. దీని వల్ల ఇళ్లు మొత్తం కర్పూరం వాసన వ్యాపిస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న ఎలుకలు ఆ వాసన తట్టుకోలేక ఇంట్లోనుంచి బయటకు పారిపోతాయి. ఇలా రోజూ చేయడం ద్వారా, ఎలుకల బెడదకు శాశ్వత పరిష్కారాన్ని సులభంగా కనుగొనవచ్చు. అయితే ఎలుకలు ఎక్కువగా తిరగే ప్రదేశాలలో చిన్న కర్పూరం ముక్కలను ఉంచినా అటువైపు ఎలుకలు రావు.
కర్పూరం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటి?
కర్పూరం ఎలుకలను తరిమికొట్టడమే కాకుండా, ఇంటికి సువాసనను కూడా జోడిస్తుంది. దీని సువాసన తాజాదనాన్ని కలిగిస్తుంది. బ్యాక్టీరియాను ఇంటి నుండి దూరంగా ఉంచుతుంది. ఇది సహజమైన, రసాయన రహిత పద్ధతి. కర్పూరం ఎలుకలను తరిమికొట్టడమే కాకుండా కీటకాల తెగుళ్ల నుండి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
