జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్‌నెస్! ప్రతిరోజూ ఇలా చేస్తే ముఖంలో మెరుపు, ఆరోగ్యం మీ సొంతం
ఆధునిక జీవనశైలిలో ఫిట్‌నెస్ కోసం చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి జిమ్ మెంబర్‌షిప్‌లు తీసుకుంటారు. గంటల తరబడి యంత్రాల మీద కష్టపడుతుంటారు. అయితే, ఖర్చు లేకుండా, ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక పురాతన వ్యాయామ పద్ధతి మనకు అందుబాటులో ఉంది.

కేవలం 10 నుండి 15 నిమిషాల పాటు ఇంట్లోనే దీనిని ప్రాక్టీస్ చేస్తే, జిమ్‌లో గంటల తరబడి చేసే వర్కౌట్ల కంటే ఎక్కువ ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, మనస్సును ప్రశాంతపరిచే ఒక ఆధ్యాత్మిక సాధన కూడా. ఆ అద్భుత ప్రక్రియే ‘సూర్య నమస్కారం’. ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలో కలిగే ఆశ్చర్యకరమైన మార్పులు ఏంటో తెలుసుకుందాం..
వేగంగా బరువు తగ్గడం
బరువు తగ్గాలనుకునే వారికి సూర్య నమస్కారం ఒక వరప్రసాదం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఆసనాలను వేగంగా చేయడం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇది శరీరంలోని క్యాలరీలను వేగంగా దహించడంలో తోడ్పడుతుంది. జీవక్రియను మెరుగుపరచడం ద్వారా మొండి కొవ్వును కరిగించి, స్థూలకాయం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుంది. జిమ్ యంత్రాల కంటే సహజంగా శరీరాన్ని సరళంగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
రక్త ప్రసరణ – మెరిసే చర్మం
సూర్య నమస్కారంలోని వివిధ భంగిమలు శరీరంలోని ప్రతి అవయవానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల అవయవాల పనితీరు మెరుగుపడటమే కాకుండా, కణాలకు ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగడం వల్ల చర్మం సహజంగానే ప్రకాశవంతంగా మారుతుంది. ముఖంపై ముడతలు తగ్గి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. చర్మ సౌందర్యం కోసం ఖరీదైన క్రీములు వాడేకంటే, రోజువారీ సూర్య నమస్కారాలు చేయడం ఎంతో మేలు.

Surya Namaskar2
రోగనిరోధక శక్తి
ప్రస్తుత కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, సాధారణ వ్యాధులు తరచుగా ఇబ్బంది పెడుతున్నాయి. సూర్య నమస్కారాలను క్రమం తప్పకుండా చేసే వారిలో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇది శరీర అంతర్గత వ్యవస్థలను బలోపేతం చేసి, బయటి నుండి వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
మానసిక ప్రశాంతత – ఏకాగ్రత
సూర్య నమస్కారంలో శ్వాస నియంత్రణ అనేది చాలా ముఖ్యం. ఆసనాలు వేస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాసల మీద దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు మటుమాయం అవుతాయి. ఇది మెదడును ప్రశాంతపరిచి, ఏకాగ్రతను పెంచుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటం వల్ల శ్వాసకోశ సమస్యలు దరిచేరవు. మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ధ్యానంలా పనిచేస్తుంది.
సంప్రదాయబద్ధంగా సూర్యుడిని శక్తికి మూలంగా భావిస్తారు. సూర్య నమస్కారం చేయడం అంటే ఆ ప్రకృతి శక్తికి కృతజ్ఞతలు తెలపడమే. ఇది శారీరక దృఢత్వంతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా ప్రసాదిస్తుంది. మనస్సును క్రమశిక్షణలో ఉంచి, జీవనశైలిలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. జిమ్‌కు వెళ్లే సమయం లేని వారు లేదా ఖర్చు లేకుండా ఫిట్‌గా ఉండాలనుకునే వారు సూర్య నమస్కారాలను ఎంచుకోవడం ఉత్తమం. రోజుకు కేవలం 10 నిమిషాలు కేటాయిస్తే మీ జీవితకాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
