AR Rahman: ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఎందుకు ఇస్లాంలోకి మారాడు? ఆ ఒక్క సంఘటనతో..
తన పాటలతోనే కాదు తన వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలిచారు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్. ముఖ్యంగా హిందూ కుటుంబంలో పుట్టిన అతను ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. దిలీప్ కుమార్ పేరును కాస్తా రెహమాన్ గా మార్చుకున్నాడు. మరి అతని నిర్ణయం వెనక కారణమేంటి?

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సంగీత ప్రతిభకు ప్రపంచమే సలాం కొట్టింది. రెహమాన్ తన స్వరంతో సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేశారు. అయితే కానీ రెహమాన్ తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కారణంగానూ వార్తల్లో నిలిచారు. హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారడం, భార్యతో విడాకులు తీసుకోవడం.. ఇలా చాలా కారణాలతో వార్తల్లో నిలిచారు రెహమాన్. మరీ ముఖ్యంగా హిందూ కుటుంబంలో పుట్టిన రెహమాన్ ముస్లిం మతంలోకి మారడం గతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరి ఆ నిర్ణయం వెనక కారణమేమిటి? అన్న విషయానికి వస్తే.. ఎ.ఆర్. రెహమాన్ 1967 జనవరి 6న తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. అతని అసలు పేరు దిలీప్ కుమార్. అయితే అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు రెహమాన్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో అతను ముస్లిం మతంలోకి మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం గురించి రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడాడు..
కాగా రెహమాన్ తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతున్న చివరి రోజుల్లో ఒక సూఫీ సాధువు ఆయనకు చికిత్స చేశాడు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత రెహమాన్ ఇస్లాం మతంలోకి మారారు. ‘. “సూఫీయిజం మార్గంలో ఎవరినీ మతం మార్చుకోమని బలవంతం చేయరు. ఇది మీ హృదయపూర్వకంగా నచ్చినప్పుడే మీరు దీనిని అనుసరిస్తారు. సూఫీ మార్గం మాకు ఉత్తమ మార్గం అని మేము భావించాము, అందుకే మేము సూఫీ – ఇస్లాంను స్వీకరించాము. మా చుట్టూ ఉన్న ఎవరికీ మతం మార్చుకోవడం గురించి పట్టింపులు లేవు. మేము సంగీత విద్వాంసులం’ అని రెహమాన్ చెప్పుకొచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో A.R. రెహమాన్ తనకు సంగీత పరిశ్రమలోకి ప్రవేశించే ఉద్దేశ్యం లేదని వెల్లడించాడు. బదులుగా, అతను కంప్యూటర్ ఇంజనీర్ కావాలని కోరుకున్నాడు. కానీ విధి మరోలా తలచింది. 1992లో విడుదలైన ‘రోజా’ చిత్రంతో రెహమాన్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి దిగ్గజ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
రెహ్మాన్, సైరా 1995 లో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు, ఖతీజా, రహీమా, అమీన్. అయితే 29 ఏళ్లు కలిసి కాపురం చేసిన రెహ్మాన్, సైరా కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ విడాకుల కేసు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




