Gold Prices: దిగొచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్.. గురువారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rates Today: బంగారం ధరలు మళ్లీ కాస్త శాంతించాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోన్న గోల్డ్, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు. గత కొంతకలంగా గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో..

Gold And Silver Rates: బంగారం రేట్లు గత కొంతకాలంగా భారీగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆమాంతం పెరుగుతూ వస్తోండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతల ప్రభావం గోల్డ్ రేటుపై ప్రభావితం చూపిస్తోంది. ఈ కారణంతో పసడి ధరలు ఆకాశాన్నంటుతుండగా.. గురువారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
గోల్డ్ రేట్లు చూస్తే..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,38,260గా ఉండగా.. నిన్న ఈ ధర రూ.1,38,270గా ఉంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,26,740గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,26,750 వద్ద స్థిరపడింది.
-విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,38,260గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,26,740 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
-అటు చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,630 వద్ద కొనసాగుతుండగా.. నిన్న ఈ ధర రూ.1,39,640 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,990 వద్ద ట్రేడవుతోంది. నిన్న ఈ ధర రూ.1,28,000గా ఉంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,38,260 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,26,740 వద్ద కొనసాగుతోంది.
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,640 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,010గా ఉంది.
వెండి ధరలు ఇలా..
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,57,100 వద్ద కొనసాగుతోంది
-హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,77,100గా ఉంది
-చెన్నైలో కేజీ వెండి రూ.2,77,100 వద్ద కొనసాగుతోంది
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,57,100 వద్ద కొనసాగుతోంది.
