Business Ideas: నెలకు రూ.లక్ష ఆదాయం ఇచ్చే ట్రెండీ బిజినెస్! రూపాయి పెట్టుబడి అక్కర్లేదు.. ఫోన్ ఉంటే చాలు
స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజింగ్ ద్వారా నెలకు లక్షల సంపాదన సాధ్యమే. మేనేజ్‌మెంట్ నైపుణ్యాలతో తక్కువ పెట్టుబడితో స్పోర్ట్స్ టోర్నమెంట్‌లు, ముఖ్యంగా క్రికెట్ ఈవెంట్‌లు నిర్వహించి యువత డబ్బు సంపాదించవచ్చు. టీమ్ ఎంట్రీ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఆదాయం పొందవచ్చు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

చాలా మందికి బిజినెస్ అంటే వస్తువులు అమ్మడం, లేదా తయారీ చేయడం అని అనుకుంటూ ఉంటారు. బట్ మనసు పెట్టి ఆలోచించాలి కానీ సర్వీస్ అందించి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే కాస్త మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉంటే చాలు ప్రతి నెల రూ.లక్ష ఆదాయం పొందే ఓ ట్రెండీ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ బిజినెస్ పేరు స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజింగ్. మీ పరిసర ప్రాంతాల్లో యూత్ బాగా ఆడే గేమ్స్ ఏంటో తెలిసి ఉంటే చాలు. ఆ గేమ్కు సంబంధించి ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి మంచి ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు క్రికెట్ తీసుకుంటే.. మన దేశంలోని యూత్లో వందలో 80 మంది క్రికెట్ ఆడతారు. సో.. వచ్చేది సమ్మరే కనుక స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఈ టైమ్లో మంచి గ్రౌండ్ రెడీ చేసుకొని క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి టీమ్ ఎంట్రీ ఫీజు, స్పాన్సర్ల నుంచి ఫండ్ జనరేట్ చేసి ఈవెంట్ను సక్సెస్ చేసి ఆదాయం పొందవచ్చు.
టీమ్ ఎంట్రీ ఫీజుతో గేమ్కు కావాల్సిన సౌకర్యాలన్ని పూర్తి చేసుకొని, స్పాన్నర్ల నుంచి ఫండ్ను జనరేట్ చేసి, వారి బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఆ అమౌంట్లో కొంత పర్సంటేజ్ మీరు తీసుకోవచ్చు. పైగా స్పోర్ట్స్పై ఇంట్రస్ట్ ఉన్నవారికి ఇదో సరదా పనిగా కూడా ఉంటుంది. ఇందుకోసం పెట్టుబడి ఏం అవసరం లేదు, ముందే పలు స్పాన్నర్లతో మాట్లాడుకొని కొన్ని ఏర్పాట్లు చేసుకొని, మీ ఫోన్లో ఒక పోస్టర్ డిజైన్ చేసుకొని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు అదే స్ప్రెడ్ అయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు కాల్ చేస్తారు. చాలా సింపుల్గా యూత్ కూడా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
